Kamal haasan: తప్పు చేస్తేనే క్షమాపణలు చెబుతాను: కమల్‌ హాసన్‌

Kamal haasan: తప్పు చేస్తేనే క్షమాపణలు చెబుతాను: కమల్‌ హాసన్‌

Play all audios:


తప్పు చేయకపోతే క్షమాపణలు చెప్పనని కమల్‌ హాసన్‌ అన్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆయన కన్నడ భాషపై తన కామెంట్స్‌ వివాదంపై మరోసారి స్పందించారు. ఇంటర్నెట్‌ డెస్క్‌: కన్నడ భాషపై తాను చేసిన కామెంట్స్‌


విషయంలో క్షమాపణలు చెప్పాలని వస్తోన్న డిమాండ్లను కమల్‌ హాసన్‌ (Kamal Haasan) తోసిపుచ్చారు. తప్పు చేస్తేనే క్షమాపణలు చెబుతానని అన్నారు. ‘థగ్‌ లైఫ్‌’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో ఆయన కన్నడ భాషపై


చేసిన వ్యాఖ్యలు దుమారం రేపిన విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో ఓ ఇంటర్వ్యూలో తాజాగా ఆయన చేసిన కామెంట్స్‌ చర్చనీయాంశంగా మారాయి. ‘‘నేను ఏ విషయంలోనైనా తప్పు చేస్తేనే క్షమాపణలు చెబుతాను. లేదంటే


చెప్పను. అది నా శైలి. భారత్‌ ప్రజాస్వామ్య దేశం. నేను చట్టాన్ని, న్యాయాన్ని నమ్ముతాను. వాటిని గౌరవిస్తాను’’ అని చెప్పారు. ఈ విషయంలో ప్రజలు జోక్యం చేసుకోవద్దని కోరారు. ఇక తమిళం నుంచి కన్నడ


పుట్టిందంటూ కమల్‌ చేసిన వ్యాఖ్యలపై ఇప్పటికే అధికార, విపక్ష పార్టీలు ఆగ్రహం వ్యక్తంచేయగా.. కర్ణాటక ఫిల్మ్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ (KFCC) కూడా తీవ్రంగా స్పందించింది. నేటి(మే 30)లోగా క్షమాపణ


చెప్పకుంటే.. ఆయన ‘థగ్‌ లైఫ్‌’ (Thug Life) సినిమా విడుదలను రాష్ట్రంలో అడ్డుకుంటామని స్పష్టంచేసింది. * కన్నడ భాషపై కమల్‌ హాసన్‌ వ్యాఖ్యలు.. భాజపా ఆగ్రహం మరోవైపు తన కామెంట్స్‌పై ఇప్పటికే కమల్‌


హాసన్‌ వివరణ ఇచ్చారు. అవి ప్రేమతో చేసిన వ్యాఖ్యలేనని, ప్రేమ ఎన్నడూ క్షమాపణ చెప్పదన్నారు. భాష చరిత్ర గురించి ఎంతోమంది చరిత్రకారులు తనకు చెప్పారని, తన వ్యాఖ్యల్లో మరో ఉద్దేశం లేదన్నారు. అయితే,


భాష గురించి మాట్లాడే అర్హత రాజకీయ నాయకులకు లేదని, ఇది తనకు కూడా వర్తిస్తుందన్నారు.