Upcoming telugu movies: ఈ వారం చిన్న చిత్రాలదే హవా.. ఆ ఒక్కటీ ప్రత్యేకం..

Upcoming telugu movies: ఈ వారం చిన్న చిత్రాలదే హవా.. ఆ ఒక్కటీ ప్రత్యేకం..

Play all audios:


కథా బలమున్న చిత్రం ‘లెవెన్‌’ ‘నేను చేసే కథలు, పాత్రలు బాగుంటాయని ప్రేక్షకులు మొదటినుంచి ప్రశంసిస్తున్నారు. ఆ గౌరవానికి బదులుగా ఈ ‘లెవెన్‌’ (Eleven movie) చిత్రాన్ని అందిస్తున్నా. ఇప్పటివరకు


ఏ థ్రిల్లర్‌లోనూ చూడని ఓ వినూత్నమైన కాన్సెప్ట్‌ ఈ సినిమాలో ఉంది’ అంటున్నారు నవీన్‌ చంద్ర. ఆయన కీలక పాత్రలో నటించిన చిత్రమిది. లోకేశ్‌ అజ్ల్స్‌ దర్శకత్వం వహించారు. రియా కథానాయిక. ఈనెల 16న


తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానుంది. ------------------------- కామెడీ హారర్‌తో.. తమిళ కమెడియన్‌ సంతానం ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘డెవిల్స్‌ డబుల్‌ నెక్ట్స్‌ లెవల్‌’. కామెడీ హారర్‌


జానర్‌లో రూపొందిన ఈ చిత్రం మే 16న తమిళ, తెలుగు భాషల్లో విడుదల కానుంది.  2023లో వచ్చిన ‘డీడీ రిటర్న్స్‌’కు కొనసాగింపుగా దర్శకుడు ఎస్‌.ప్రేమ్‌ ఆనంద్‌ దీన్ని తీర్చిదిద్దారు. గీతిక తివారి,


సెల్వరాఘవన్‌, గౌతమ్‌ వాసుదేవ మేనన్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ------------------------- చిన్న సినిమాల్లో ఇది చాలా పెద్ద సినిమా ‘థియేటర్‌ కోసం చాలా శ్రద్ధ తీసుకొని సాంకేతికంగా బలంగా


ఉండాలని చేసిన సినిమా ‘23’. థియేటర్‌లో చూసి అనుభూతి చెందాల్సిన చిత్రమిది’ అంటున్నారు దర్శకుడు రాజ్‌.ఆర్‌.  తేజ, తన్మయి జంటగా నటించారు. స్టూడియో 99 నిర్మించగా, స్పిరిట్‌ మీడియా విడుదల


చేస్తోంది. ఈ చిత్రం ఈనెల 16న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ------------------------- యాక్షన్‌ ప్రియులను అలరించేందుకు.. హాలీవుడ్‌ నటుడు టామ్‌ క్రూజ్‌ (Tom Cruise) ప్రధాన పాత్రలో నటించిన చిత్రం


‘మిషన్‌ ఇంపాసిబుల్‌: ద ఫైనల్‌ రెకనింగ్‌’ (Mission Impossible The final Reckoning). స్పై యాక్షన్‌ థ్రిల్లర్‌ నేపథ్యంలో క్రిస్టోఫర్‌ మేక్‌క్వారీ తెరకెక్కించారు. అన్ని కార్యక్రమాలు


పూర్తిచేసుకున్న ఈ మూవీ మే 17న ప్రేక్షకుల ముందుకురానుంది. తెలుగు, తమిళ, హిందీ, మలయాళ భాషల్లో విడుదల కానుంది. ప్రపంచాన్ని నాశనం చేయాలనుకుంటున్న ‘ఎన్‌టీటీ’ను ఈథన్‌ హంట్‌ ఎలా అడ్డుకున్నాడు? ఈ


క్రమంలో అతడికి ఎదురైన సవాళ్లేంటి? తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఈ వారం ఓటీటీలో అలరించే చిత్రాలు.. * నెట్‌ఫ్లిక్స్‌ * సీ4 సింటా (తమిళ) మే 12 * ది రిజర్వ్‌ (వెబ్‌సిరీస్) మే 15 * అమెజాన్‌


ప్రైమ్‌ * ఓవర్‌ కాంపన్సేటింగ్‌ (వెబ్‌సిరీస్‌) మే 15 * భూల్‌ చుక్‌ మాఫ్‌ (హిందీ) మే 16 * జియో హాట్‌స్టార్‌ * హై జునూన్‌ (హిందీ సిరీస్‌) మే 16 * ఈటీవీ విన్‌ * అనగనగా (తెలుగు) మే 15 * సోనీలివ్‌


* మరనమాస్‌ (మలయాళం) మే 15 * సన్‌నెక్ట్స్‌ * నెసిప్పాయా (తమిళ) మే 17