Virat kohli: విరాట్‌ కోహ్లీకి టెస్టు పగ్గాలివ్వాలి: మైకేల్‌ వాన్‌

Virat kohli: విరాట్‌ కోహ్లీకి టెస్టు పగ్గాలివ్వాలి: మైకేల్‌ వాన్‌

Play all audios:


ఇంగ్లండ్‌తో టీమ్‌ఇండియా జూన్‌లో అయిదు టెస్ట్‌ మ్యాచ్‌ల సిరీస్‌ ఆడనుంది. ఈనేపథ్యంలో విరాట్‌ కోహ్లీకి టెస్టు పగ్గాలు అప్పగించాలని ఇంగ్లండ్‌ మాజీ క్రికెటర్‌ మైకేల్‌వాన్‌ ‘ఎక్స్‌’ వేదికగా


బీసీసీఐకి సూచించాడు. ఇంటర్నెట్‌ డెస్క్‌: టీమ్‌ఇండియా (Team India), ఇంగ్లండ్‌తో జూన్‌లో అయిదు టెస్టుమ్యాచ్‌ల సిరీస్‌ ఆడనుంది. ఈనేపథ్యంలో సెలక్టర్లు భారత జట్టును ఎంపిక చేయాల్సి ఉంది. ఇటీవలే


రోహిత్‌ శర్మ (Rohit Sharma) తన టెస్టు కెరీర్‌కు వీడ్కోలు పలికాడు. దీంతో సెలక్టర్లకు జట్టు ఎంపిక కాస్త జఠిలంగా మారింది. ఇదే సమయంలో విరాట్‌ కోహ్లీ కూడా సుదీర్ఘ ఫార్మాట్‌ నుంచి తప్పుకోనున్నట్లు


వార్తలు వినిపిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఇంగ్లండ్‌ మాజీ క్రికెటర్‌ మైకేల్‌ వాన్‌ (Michael Vaughan), బీసీసీఐకి (BCCI) ఓ ఆసక్తికర సూచన చేశాడు.  రోహిత్‌ శర్మ టెస్టు ఫార్మాట్‌కు


రిటైర్‌మెంట్‌ ప్రకటించిన నేపథ్యంలో ఇంగ్లండ్‌తో భారత్‌ ఆడే టెస్ట్‌ మ్యాచ్‌లకు విరాట్‌ కోహ్లీని (Virat Kohli)  కెప్టెన్‌గా నియమిస్తే బాగుంటుందని మైకేల్‌వాన్‌ అభిప్రాయపడ్డాడు. ‘ఒక వేళ నేనే


టీమ్‌ఇండియా సెలక్టర్‌ను అయితే.. ఇంగ్లండ్‌తో జరిగే టెస్ట్‌ సిరీస్‌కు విరాట్‌ కోహ్లీని కెప్టెన్‌గా, శుభ్‌మన్‌గిల్‌ను (Shubman Gill) వైస్‌ కెప్టెన్‌గా నియమిస్తాను’ అని మైకెల్‌ వాన్‌ ఎక్స్‌లో


పోస్టు చేశాడు. అయితే తన రిటైర్‌మెంట్‌ గురించి కోహ్లీ, బీసీసీఐకి ఇంకా ఏ విషయమూ తేల్చిచెప్పలేదు. మరోవైపు టీమ్‌ఇండియా మాజీ క్రికెటర్‌ మహ్మద్‌ కైఫ్‌ (Mohammad Kaif).. విరాట్‌ తన రిటైర్‌మెంట్‌


ఆలోచన గురించి పునఃపరిశీలన చేసుకోవాలని సూచించాడు. ఇంగ్లండ్‌ సిరీస్‌లో సత్తా చాటి, ఘనంగా వీడ్కోలు పలకమని సలహా ఇచ్చాడు. విరాట్‌ కొన్నాళ్లుగా ఆఫ్‌సైడ్‌ బంతులతో ఇబ్బందిపడుతున్న విషయాన్నీ


ప్రస్తావించాడు. ఈమేరకు కైఫ్‌... ఎక్స్‌లో వీడియో పోస్ట్‌ చేశాడు.