Elon musk: రాజకీయ ప్రచారాలకు తక్కువ ఖర్చు చేస్తా - ఎలాన్‌ మస్క్‌

Elon musk: రాజకీయ ప్రచారాలకు తక్కువ ఖర్చు చేస్తా - ఎలాన్‌ మస్క్‌

Play all audios:


అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌నకు (Donald Trump) ఎలాన్‌ మస్క్‌ ఆర్థికంగా కీలక మద్దతుదారుగా ఉన్న విషయం తెలిసిందే. ఇంటర్నెట్‌ డెస్క్‌: భవిష్యత్తులో రాజకీయ ప్రచారాలకు ఇక తక్కువగా ఖర్చు


పెడతానని ప్రపంచ కుబేరుడు ఎలాన్‌ మస్క్‌ (Elon Musk) పేర్కొన్నారు. ఖతార్‌లో జరిగిన ఓ ఆర్థిక సదస్సులో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడిన ఆయన.. వీటికోసం ఇప్పటికే చాలా ఖర్చుపెట్టినట్లు


చెప్పారు. వచ్చే ఏడాది మిడ్‌టర్మ్‌ ఎన్నికలు జరగనున్న వేళ మస్క్‌ ప్రకటన రిపబ్లికన్‌ పార్టీ నేతలకు ఎదురుదెబ్బగానే భావిస్తున్నారు. అమెరికా అధ్యక్షుడు, రిపబ్లికన్‌ నేత డొనాల్డ్‌ ట్రంప్‌నకు


(Donald Trump) ఎలాన్‌ మస్క్‌ ఆర్థికంగా కీలక మద్దతుదారుగా ఉన్న విషయం తెలిసిందే. అమెరికా పీఏసీకి (Political Action Committee) ప్రధాన ఆర్థిక వనరుగా ఉన్న ఆయన.. గతేడాది అధ్యక్ష ఎన్నికల (US


Elections) ప్రచారం కోసం దాదాపు 250 మిలియన్‌ డాలర్లు ఖర్చు పెట్టారు. రానున్న ఎన్నికల్లోనూ భారీ ఖర్చు చేస్తారని ట్రంప్‌ మద్దతుదారులు భావిస్తున్న సమయంలో ప్రపంచ కుబేరుడి మనసులో మాటను


బయటపెట్టారు. * ఉద్రిక్తతల వేళ.. పాకిస్థాన్‌ ఆర్మీ చీఫ్‌కు ప్రమోషన్‌ అధ్యక్షుడిగా డొనాల్డ్‌ ట్రంప్‌ ఎన్నికైన తర్వాత ఏర్పాటైన డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ గవర్నమెంట్‌ ఎఫీషియన్సీ (DOGE)కి ఎలాన్‌ మస్క్‌


సారథిగా వ్యవహరించారు. ప్రభుత్వ శాఖల్లో సంస్కరణలే లక్ష్యంగా ఆయన చేపట్టిన చర్యలపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో రాజకీయాలపై మస్క్‌కు ఆసక్తి తగ్గుతుందనే వాదన కూడా మొదలైంది.