
Joe biden: అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్‌కు క్యాన్సర్ నిర్ధరణ
Play all audios:

ఇంటర్నెట్‌డెస్క్: అమెరికా (USA) మాజీ అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden) ప్రొస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్నట్లు ఆయన కార్యాలయం తెలిపింది. ఇటీవల బైడెన్‌కు ఆ వ్యాధి సంబంధించిన లక్షణాలు
కనిపించడంతో వైద్యులు పరీక్షలు నిర్వహించారు. ఆయన ప్రొస్టేట్‌లో చిన్న కణతి ఏర్పడినట్లు గుర్తించారు. పరీక్షల్లో క్యాన్సర్ నిర్ధరణ అయినట్లు ఆయన కార్యాలయం ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ క్యాన్సర్
తీవ్రత ఎక్కువగా ఉందని అందులో వెల్లడించింది. దీనికి సంబంధించి చికిత్స అందించే అంశంపై బైడెన్ కుటుంబసభ్యులు వైద్యులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిపింది. ఈ విషయం తెలిసి చాలా బాధపడ్డాం:
ట్రంప్ బైడెన్‌కు క్యాన్సర్ నిర్ధరణ కావడంపై ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ట్రూత్ సోషల్ వేదికగా స్పందించారు. ‘జో బైడెన్‌కు క్యాన్సర్ నిర్ధరణ విషయం తెలిసి నేను,
మెలానియా చాలా బాధపడ్డాం. ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాం’ అని ట్రంప్ పేర్కొన్నారు. అమెరికా మాజీ ఉపాధ్యక్షురాలు కమలాహారిస్ సైతం స్పందిస్తూ బైడెన్‌కు క్యాన్సర్ అనే విషయం తనను కలచి
వేసిందని ‘ఎక్స్’ వేదికగా పేర్కొన్నారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో బైడెన్ కుటుంబానికి తాము అండగా ఉంటామని, ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. బైడెన్ పోరాట యోధుడని పేర్కొన్న
ఆమె.. ఈ క్యాన్సర్‌ను ఆయన ధైర్యంగా ఎదుర్కొంటారని ఆశాభావం వ్యక్తం చేశారు. మరోవైపు, జో బైడెన్ ఆరోగ్యం గురించి భారత ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆందోళన వ్యక్తం చేశారు. ఆయన త్వరగా కోలుకోవాలని
ఆకాంక్షిస్తూ ‘ఎక్స్’లో పోస్టు పెట్టారు.