
Yunus: యూనస్ కొనసాగుతారు.. రాజీనామా వార్తలపై సలహాదారు
Play all audios:

ఇంటర్నెట్‌డెస్క్: బంగ్లాదేశ్ (Bangladesh) తాత్కాలిక ప్రభుత్వాధినేతగా మహమ్మద్ యూనస్ (Muhammad Yunus) పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధమైనట్లు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. విషయంపై
తాజాగా అతడి ఆయన మంత్రివర్గ సలహాదారు వహీదుద్దీన్ మహమూద్ మాట్లాడుతూ.. అవన్నీ అసత్య ప్రచారాలని కొట్టిపడేశారు. బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేతగా మహమ్మద్ యూనస్ కొనసాగుతారని స్పష్టం చేశారు.
‘‘దేశంలో నెలకొంటున్న ఉద్రిక్త పరిస్థితులకు భయపడి యూనస్ రాజీనామా చేస్తానని చెప్పలేదు. ప్రభుత్వానికి కేటాయించిన బాధ్యతలను నిర్వర్తించడంలో అనేక అడ్డంకులను ఎదుర్కొంటున్నప్పటికీ వాటిని
అధిగమించడానికి ప్రయత్నిస్తున్నాము’’ అని ఆయన పేర్కొన్నారు. యూనస్ దాదాపు 19 మంది సలహాదారులు, మంత్రులు, ఇతర అధికారులతో అత్యవసర సమావేశం నిర్వహించిన అనంతరం వహీదుద్దీన్ ఈ వ్యాఖ్యలు చేశారు. తమ
తాత్కాలిక ప్రభుత్వానికి అప్పగించిన బాధ్యత ఎంతో ముఖ్యమైనది..దానిని తాము మధ్యలో వదులుకోలేమని ఆయన అన్నారు. ప్రభుత్వ సలహాదారులు కూడా ఎక్కడికీ వెళ్లడంలేదని స్పష్టం చేశారు. దేశ భద్రత, భవిష్యత్తు
కోసం ప్రజల డిమాండ్లను తీర్చడానికి తమ ప్రభుత్వానికి అధికారులందరూ సహకరించాలని యూనస్ చర్చల్లో కోరారని అన్నారు. * అత్యంత క్రూరదశలో ఇజ్రాయెల్ యుద్ధం శుక్రవారం నేషనల్ సిటిజన్ పార్టీ (ఎన్‌సీపీ)
చీఫ్ నహిద్ ఇస్లామ్, యూనస్ రాజీనామా గురించి ఓ మీడియాతో మాట్లాడారు. ‘యూనస్ రాజీనామా గురించి వచ్చిన వార్తలు నేను విన్నాను. దానిపై చర్చించేందుకు ఆయన్ను కలిశాను. రాజీనామా గురించే
ఆలోచిస్తున్నానని యూనస్ నాతో చెప్పారు. దేశంలోని రాజకీయ పార్టీలు ఐక్యంగా లేకపోతే తాను పనిచేయలేనని ఆయన వెల్లడించారు. దేశ భద్రత, భవిష్యత్తు కోసం బలంగా ఉండాలని ఆయనకు చెప్పాను. పార్టీలన్నీ
ఐక్యంగా ఉండి ఆయనకు సహకరిస్తాయని ఆశిస్తున్నా. పార్టీలకు ఆయనపై విశ్వసనీయత లేనప్పుడు యూనస్ పదవిలో ఎలా కొనసాగుతారు?’ అని నహిద్ పేర్కొన్నారు. దీంతో ఆయన రాజీనామా చేయనున్నారనే వార్తలు
ఊపందుకున్నాయి.