
Russia: రష్యాలో కూలిన మరో వంతెన.. పట్టాలు తప్పిన గూడ్స్ రైలు..
Play all audios:

Russia | ఇంటర్నెట్‌డెస్క్: రష్యాలోని బ్రయాన్స్క్‌లో వంతెన కూలి రైలు బోల్తాపడిన ఘటన చోటు చేసుకుని 24 గంటలు గడవక ముందే.. అలాంటి ప్రమాదమే క్రస్క్‌లో చోటుచేసుకొంది. ఆదివారం తెల్లవారుజామున మరో
రైలు వంతెన కూలిపోయింది. దీంతో దానిపై వెళ్తున్న ఓ గూడ్స్ రైలు బోల్తాపడింది. ఈ విషయాన్ని ఆ ప్రాంత గవర్నర్ అలెగ్జాండర్ కిన్స్‌టెయిన్ ధ్రువీకరించారు. ప్రమాదం జరిగిన ప్రాంతం ఉక్రెయిన్
సరిహద్దులకు అత్యంత సమీపంలో ఉందని పేర్కొన్నారు. శనివారం పశ్చిమ బ్రియాన్స్క్ ప్రాంతంలో ఓ వంతెన కూలిపోవడంతో.. ప్రయాణికుల రైలు బోల్తాపడింది. ఈ ఘటనలో ఏడుగురు చనిపోగా.. 69 మంది తీవ్రంగా
గాయపడ్డారు. ఈ విషయాన్ని అక్కడి గవర్నర్ వెల్లడించారు.. ఈ రైలు మాస్కో నుంచి కిల్‌మోవ్ ప్రాంతానికి వెళుతుండగా ప్రమాదం చోటు చేసుకుంది. మృతుల్లో రైలు డ్రైవర్ కూడా ఉన్నారు.