
Kamareddy news | latest kamareddy news - eenadu
Play all audios:

బీర్కూర్ : ఆయిల్‌పామ్ సాగు చేయడం వల్ల రైతులకు అధిక లాభాలు వస్తాయని ప్రభుత్వ వ్యవసాయ శాఖ సలహాదారుడు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. బీర్కూర్ మండలంలోని రైతు న గర్
గ్రామంలో రైతు వేదిక భవనంలో జిల్లా జిల్లా ఉద్యాన పట్టు పరిశ్రమ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం రైతులకు ఆయుల్‌పామ్‌సాగుపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా పాల్గొని
మాట్లాడారు. ఆయిల్‌పామ్ సాగు వల్ల దీర్ఘకాల పంట, కుక్కలు, కోతుల బెడద లేకుండా ఒక్కసారి సాగు చేస్తే 30 ఏళ్ల వరకు పంట చేతికొస్తుందన్నారు. వంట నూనె ఉత్పత్తులు స్వయం సమృద్ధి సాధించాలంటే
ఆయిల్‌పామ్ సాగు ఒక్కటే పరిష్కారమని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆగ్రోస్ రాష్ట్రఛైర్మన్ కాసుల బాలరాజు, జిల్లా ఉద్యాన శాఖాధికారిణి జ్యోతి, డివిజన్ అధికారిణి సంతోష్‌రాణి ఏడీఏ
లక్ష్మీప్రసన్న, ఆయిల్‌పామ్ జిల్లా జనరల్ మేనేజర్ అశోక్, తహసీల్దార్ లత, ఎంపీడీవో భారతి తదితరులు పాల్గొన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి జన్మదిన వేడుకలు బీర్కూర్‌లో శుక్రవారం కాంగ్రెస్ పార్టీ
ఆధ్వర్యంలో సీఎం రేవంత్‌రెడ్డి జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్టీసీ బస్టాండ్ వద్ద నాయకులు కేక్ కట్ చేసి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండలాధ్యక్షుడు శంకర్ రాములు,
నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఆయిల్‌పామ్ సాగుతో రైతులకు అధిక లాభాలు ఆయిల్‌పామ్ సాగు చేయడం వల్ల రైతులకు అధిక లాభాలు వస్తాయని ప్రభుత్వ వ్యవసాయ శాఖ సలహాదారుడు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం
శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు