
Currency notes: జనవరి 1 నుంచి కొత్త రూ. 1,000 నోట్లు.. రూ. 2 వేలు నోట్లు రద్దు? అసలు విషయం ఇదీ!
Play all audios:

Published by: Last Updated:December 25, 2022 1:32 PM IST RS 1000 NOTES | రూ.2 వేల నోట్లు రద్దు అయ్యాయని, కొత్త రూ.1000 నోట్లు వస్తున్నాయని ఒక మెసేజ్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇందులో
నిజం లేదు. పూర్తిగా ఫేక్. Rs 2000 Notes | కొత్త రూ.1000 కరెన్సీ నోట్లు మళ్లీ చెలామణిలోకి రానున్నాయా? రూ. 2 వేల నోట్లను ఉపసంహరించ బోతున్నారా? సామాజిక మాధ్యమాల్లో ఈ కొత్త రూ.1000 నోట్లకు
సంబంధించి ఒక మెసేజ్ తెగ వైరల్ అవుతోంది. ఒక వీడియో నెట్టింట్లో తెగ హల్ చల్ చేస్తోంది. కొత్త రూ.1000 నోట్లు వస్తాయని, అలాగే రూ.2 వేల నోట్లకు (2000 Notes) బ్యాంకులకు (Bank) వెనక్కి ఇవ్వాల్సి
ఉంటుందని సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోలో ఉన్న సారాంశం. అయితే ఇందులో నిజం లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రెస్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ బ్యూరోకు సంబంధించిన పీఐబీ ఫ్యాక్ట్ చెక్ తాజాగా ఈ
అంశంపై స్పందించింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోను ఎవ్వరూ షేర్ చేయవద్దని కోరింది. ఇది పూర్తిగా ఫేక్ అని పేర్కొంది. కేంద్ర ప్రభుత్వం ఎలాంటి కొత్త రూ. 1000 నోట్లను తీసుకురావడం లేదని
స్పష్టం చేసింది. అలాగే రూ.2 వేలు నోట్లు వెనక్కి ఇవ్వాల్సిన పని లేదని పేర్కొంది. కేంద్ర ప్రభుత్వం రూ. 2 వేల నోట్లను బ్యాన్ చేయలేదని వెల్లడించింది. అందువల్ల ఎవరైనా ఇలాంటి వైరల్ మెసేజ్‌లు పొంది
ఉంటే.. జాగ్రత్తగా ఉండాలి. కొత్త రూ. 1000 నోట్లు అంశం ఫేక్ అని వెల్లడించింది. advertisement కేంద్ర ప్రభుత్వం డీమానిటైజేషన్ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా పాత రూ. 500
నోట్లను, రూ.1000 నోట్లను రద్దు చేశారు. ఫేక్ కరెన్సీ నోట్లు, టెర్రర్ ఫైనాన్సింగ్, నల్ల ధనం, పన్ను ఎగవేలను అడ్డుకునేందుకు ఈ డీమానిటైజేషన్ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర ప్రభుత్వం గతంలోనే
స్పష్టంగా తెలియజేసింది. advertisement > सोशल मीडिया पर वायरल > वीडियों में दावा किया जा > रहा कि 1 जनवरी से 1 हजार का > नया नोट आने वाले हैं और 2 > हजार के नोट बैंकों में >
वापस लौट जाएंगे। #PIBFactCheck > ▶️ये दावा फर्जी है। > ▶️कृपया ऐसे भ्रामक मैसेज > फॉरवर्ड ना करें। > pic.twitter.com/rBdY2ZpmM4 > — PIB Fact Check (@PIBFactCheck) December
16, 2022 advertisement డీమానిటైజేషన్ సమయంలోనే కేంద్ర ప్రభుత్వం కొత్త రూ.2 వేల కరెన్సీ నోట్లను తీసుకువచ్చింది. అయితే రూ. 2 వేల నోట్ల చెలామణి అనేది తగ్గిపోయింది. రూ. 2 వేల నోట్లు కనిపించడం
లేదు. కేంద్ర ప్రభుత్వం ఈ అంశంపై కూడా స్పష్టత ఇచ్చింది. రూ. 2 వేల నోట్లను ప్రింట్ చేయడం లేదని దేశీ కేంద్ర బ్యాంక్ రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) వెల్లడించింది. బ్యాంకులు కూడా వీటిని
ఏటీఎంలలో పెట్టడం లేదు. దీంతో రూ.2 వేల నోట్ల చెలామణి తగ్గిపోయింది. advertisement 2020 మార్చి నెల చివరి నాటికి చూస్తే.. వ్యవస్థలో చలామణిలో ఉన్న రూ.2 వేల నోట్ల సంఖ్య 274 కోట్లుగా ఉంది. మొత్తం
కరెన్సీ సర్క్యూలేషన్‌లో దీని వాటా కేవలం 2.4 శాతం మాత్రమే. 2021 మార్చి నెలలోని రూ. 2 వేల కరెన్నీ నోట్ల సంఖ్య 245 కోట్లుగా ఉంది. అంటే ఈ నోట్ల మార్కెట్ వాటా మొత్తం కరెన్సీ నోట్లలో 2 శాతానికి
క్షీణించింది. డీమానిటైజేషన్ నిర్ణయం తీసుకొని ఆరేళ్లు అవుతున్నా కూడా ప్రజల వద్ద ఉన్న కరెన్సీ నోట్లు మాత్రం ఆల్‌టైమ్ గరిష్టాన్ని తాకింది. Location : Hyderabad,Hyderabad,Telangana
Visakhapatnam,Visakhapatnam,Andhra Pradesh First Published : December 25, 2022 1:31 PM IST Read More