
Network18 - sadak suraksha abhiyan: ఓవర్ స్పీడ్, నిర్లక్ష్యపు డ్రైవింగ్ వల్ల ప్రమాదాలు.. నెట్‌వర్క్18 రోడ్ సేఫ్టీ కార్యక్రమంలో సీవీ ఆనంద్
Play all audios:

Published by: Last Updated:January 16, 2025 1:50 PM IST SADAK SURAKSHA ABHIYAN 2025: రోడ్డు ప్రమాదాల నివారణకు హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ కీలకమైన సూచనలు చేశారు. ఆయన ఏమన్నారో
తెలుసుకుందాం. రోడ్డు ప్రమాదాలు చూస్తుంటే మరణాల సంఘఖ్యను బట్టీ అవగాహనా కార్యక్రమాలు చాలా అవసరం అన్నారు హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్. హైదరాబాద్.. గడ్చిబౌలి లోని రాడిసన్ హోటల్‌లో
జరిగిన సడక్ సురక్షా అభియాన్ కార్యక్రమంలో ఆయన పాల్గొని, కీలక సూచనలు చేశారు. రహదారి భద్రతకు సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్, ఎడ్యుకేషన్. ఇంజినీరింగ్, ఎమర్జెన్సీ కేర్ వంటివి చాలా అవసరం అన్న ఆయన..
2024లో రోడ్డు ప్రమాదాల్లో మృతుల సంఖ్య 1.72 లక్షలుగా ఉందన్నారు. మృతుల్లో ఎక్కువ మంది 18-35 సంవత్సరాల మధ్య వారేనని తెలిపారు. వీళ్లలో ఎక్కువగా ఫ్యామిలీతో ప్రయాణించిన వారే ఉన్నారని వివరించారు.
అభివృద్దిలో భాగంగా రోడ్డు సేఫ్టీ కోసం కారిడార్స్ పెరిగినప్పుడు యాక్సిడెంట్స్ తగ్గాలి, మరణాలు తగ్గాలి కానీ.. ఈ విధానంలో కొన్ని పొరపాట్లు ఉన్నాయని సీవీ ఆనంద్ అభిప్రాయపడ్డారు. "నేను
ట్రాఫిక్ విభాగంలో పనిచేసినప్పుడు ఇలాంటి పరిణామాలను బాగా పరిశీలించాం. ORRని చూడగానే స్పీడ్‌గా వెళ్లాలని మాత్రమే అనుకుంటాం కాని.. ప్రమాదం జరుగుతుందనే విషయాన్ని మార్చిపోతాం" అని ఆయన
తెలిపారు. ఓవర్ స్పీడ్ వల్ల ప్రమాదాలు జరుగుతాయనే విషయం ఎవరూ చెప్పట్లేదని ఆయన అభిప్రాయపడ్డారు. advertisement చిన్నప్పటి నుంచే రోడ్డు ప్రమాదాలపై అవగాహన కలగాలన్నారు. "నేను అమెరికాలో
వెళ్లినప్పుడు 5 ఏళ్ల పాప రాంగ్ సైడ్‌లో పార్క్ చేసింది. అది తప్పని అందరూ చెప్పారు. మన దేశంలో చిన్నప్పటి నుంచే అలా చెప్పే వారు లేరు. స్కూల్ స్టేజ్ నుంచే రాంగ్ సైడ్ పార్కింగ్, స్పీడ్ డ్రైవింగ్
మీద అవగాహన కల్పిస్తేనే ప్రమాదాలను అరికట్టవచ్చు నైట్ టైం రెడ్ సిగ్నల్ పడినప్పుడు ఎవరూ లేరని సిగ్నల్ క్రాస్ చేస్తాం. ఆ సమయంలోనే సడెన్‌గా హెవీ వెహికల్ వచ్చి ప్రమాదం జరుగుతుంది. భారత్‌లో 142
కోట్ల మంది ఉన్నారు. ఈ దేశంలో ప్రాణాలు పోయిన వారి కుటుంబ సభ్యులకు తప్ప ఎవరికీ ఆ బాధ ఉడట్లేదు" అని సీవీ ఆనంద్ అన్నారు. advertisement "లోయలో బస్ పడి, 39 మంది చనిపోతే దానిపై పూర్తిగా
విశ్లేషణ లేదు. జంక్షన్‌లో స్టాప్ లైన్ వేసి ఇవ్వమంటే ఇవ్వలేదు. నేనే ఎంప్లాయిస్‌తో పెయింట్ వేయించాను. నైట్ టైంలో ఓన్‌గా ఇన్ షేడ్ తీసుకొని చేయించిన సందర్భాలున్నాయి. ట్రాఫిక్ అడిషనల్ సీపీగా
ఉన్నప్పుడు ఓ కారు ఫ్లైఓవర్‌పై నుంచి పడి, హుస్సేన్ సాగర్‌లో తేలింది. ఇద్దరు చనిపోయారు. డ్రంక్ అండ్ డ్రైవ్ వల్లే ఇది జరిగింది. తాగిన టైంలో వాహనాలు నడపటమే కాకుండా వారికి మిగిలిన వారి ప్రాణాలు
తీస్తున్నారు" అని సీవీ ఆనంద్ వివరించారు. advertisement "భారతదేశంలో అందరి ఆలోచనా విధానం రూల్స్ అతిక్రమించాలనే ఉంటుంది. బ్యాక్ సీటులో కూర్చున్న వారు కూడా సీట్ బెల్ట్ వేసుకోవాలి.
స్పార్క్ ఆఫ్ టైంలో యాక్సిడెంట్ జరగవచ్చు. నాకేదైనా అయితే మా ఫ్యామిలీ ఏమౌతుంది. ప్రాణాలు పోతే మా ఫ్యామిలీని ఆదుకునే వారు ఎవరుంటారు అనే అవగాహన నిరంతరం జరుగుతూనే ఉండాలి. స్కూల్ ఎడ్యూకేషన్
సిస్టమ్‌లో కూడా ఈ ట్రాఫిక్ అవేర్‌నెస్‌రై పెంచాలి. వాహనాల సంఖ్యను దృష్టిలో పెట్టుకోవాలి. ట్రాఫిక్ పోలీసుగా ఒక్కరోజు పని చేస్తే ఎంత కష్టమో తెలుస్తుంది. రోడ్లపైకి వచ్చే వారు ఎంత నిర్లక్ష్యంగా
పని చేస్తారో అర్ధం అవుతుంది. 88 లక్షల వాహనాలు 3 కమిషనరేట్ల పరిధిలో ఉన్నాయి. ఇవన్నీ రోడ్లపైకే వెళ్లాలి కదా" అని సీవీ ఆనంద్ అన్నారు. advertisement "ట్రాఫిక్ సిగ్నల్ టైమింగ్ మేనేజ్
మెంట్ మా పరిధిలో ఉన్నంత మేరకు చేస్తున్నాం. అలాగే మా సిబ్బందిలో కూడా కొంత అలసత్వం ఉంది. 50 ఫ్లోర్లు కట్టమని ఎవరు చెప్పారు? నివాస ప్రాంతాలు, కమర్షియల్ నివాస ప్రాంతాలు కలపమని ఎవరు చెప్పారు?
దీనికి సంబంధించిన ఫ్లైఓవర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సరిగా ఉందా లేదా అని ఎవరైనా గుర్తించారా? ఒక్కో ఇంటికీ నాలుగు కార్లు ఉన్నాయి. జనాభా, వాహనాల సంఖ్య ఎక్కువగా ఉండటం వల్లే కంట్రోల్ చేయలేకపోతున్నాం.
ఆర్టీఐ, ట్రాఫిక్, పోలీస్ సిబ్బంది మధ్య సమన్వయ లోపం ఉంది. గట్టి చర్యలు తీసుకోవాలంటే కాస్త ఇబ్బంది పడతాం. పిల్లలు మా కంట్రోల్‌లో లేరని పేరెంట్స్ చెబుతున్నారు. మీరే ఏదైనా చేయమని చెబుతున్నారు.
డ్రైవర్ లెస్ కార్లే బెటర్. వాహనాలు నడిపే వారు వ్యక్తిగతంగా నిదానం పాటిస్తే సాధ్యమవుతుంది. తొందర వల్లే అనార్ధాలు. ఓపికగా ట్రాఫిక్ సిగ్నల్ పాటిస్తే ప్రమాదాలు ఉండవు" అని సీవీ ఆనంద్
వివరించారు. Location : Hyderabad,Telangana First Published : January 16, 2025 1:50 PM IST Read More