
Bmw: దేశమంతా ఒకే ధరకు bmw ఎలక్ట్రిక్ సెడాన్ i7
Play all audios:

BMW ఇండియా తన ఎలక్ట్రిక్ సెడాన్ BMW i7ను భారత్‌లో అన్ని రాష్ట్రాలలో ఒకే ఎక్స్-షోరూమ్ ధర(రూ.2.05 కోట్ల)కు అందించనున్నట్లు బీఎండబ్ల్యూ ఇండియా ఈ రోజు(మంగళవారం) తెలిపింది. ఇందులో రిజిస్ట్రేషన్
ఛార్జీలు, GST, పరిహార సెస్(Compensation Cess)లు ఉంటాయి. వినియోగదారులు బీమా, TCS, స్థానిక సెస్‌లను మాత్రమే చెల్లిస్తారు. కొత్త ధరల ప్రకారం, వినియోగదారులు BMW i7కు సంబంధించి రిజిస్ట్రేషన్
ఖర్చును చెల్లించనక్కర్లేదు. దీన్ని BMW ఇండియా చెల్లిస్తుంది. ప్రతి రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ ఖర్చులు భిన్నంగా ఉంటాయి. రాష్ట్రంలో కూడా ఇది కాలానుగుణంగా మారుతూ ఉంటుంది. ఇలాంటి ఖర్చులను సమం
చేయడానికి ఒకే ధరకు వాహనాన్ని అందిస్తున్నామని BMW గ్రూప్ ఇండియా అధ్యక్షుడు, CEO విక్రమ్ పావా PTIకు తెలిపారు. కర్ణాటకలో, మహారాష్ట్రలో లేదా మరే ఇతర రాష్ట్రంలో కస్టమర్ ఉన్నా, రిజిస్ట్రేషన్
పన్నులో ఉన్న తేడాతో సంబంధం లేకుండా అందరికీ ఒకే ధరకు వాహనం లభిస్తుందని ఆయన అన్నారు.