Ups calculator: యూపీఎస్‌లో పెన్షన్‌ ఎంతొస్తుంది? అందుబాటులోకి కాలిక్యులేటర్‌..

Ups calculator: యూపీఎస్‌లో పెన్షన్‌ ఎంతొస్తుంది? అందుబాటులోకి కాలిక్యులేటర్‌..

Play all audios:


UPS calculator: ప్రభుత్వ ఉద్యోగులకు యూపీఎస్‌ పెన్షన్‌ ఎంత వస్తుందో తెలుసుకునేందుకు కాలిక్యులేటర్‌ను కేంద్రం అందుబాటులోకి తెచ్చింది. UPS calculator | దిల్లీ: ప్రభుత్వ ఉద్యోగులు తమ పదవీ విరమణ


అనంతరం ఎంత పెన్షన్‌ వస్తుందో తెలుసుకునే వెసులుబాటును కేంద్రం కల్పించింది. కొత్తగా యూపీఎస్‌ పెన్షన్‌ కాలిక్యులేటర్‌ను అందుబాటులోకి తెచ్చింది. యూనిఫైడ్‌ పెన్షన్‌ స్కీమ్‌ ద్వారా ఎంత పెన్షన్‌


వస్తుందో దీని ద్వారా తెలుసుకోవచ్చని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ పరిధిలోని డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ (డీఎఫ్‌ఎస్‌) మంగళవారం తెలిపింది. దీని ద్వారా యూపీఎస్‌తో పాటు


ఎన్‌పీఎస్‌లో ఎంత పెన్షన్‌ వస్తుందో తెలుసుకోవచ్చని పేర్కొంది. దేన్ని ఎంచుకోవాలనే మీమాంసలో ఉన్న ఉద్యోగులకు ఇది ఉపయుక్తంగా ఉంటుందని తెలిపింది. కాలిక్యులేటర్‌ కోసం క్లిక్‌ చేయండి.. కేంద్ర


ప్రభుత్వ ఉద్యోగులకు ఏకీకృత పింఛన్‌ పథకం (UPS) తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. 2004 తరవాత ప్రభుత్వ ఉద్యోగాల్లో చేరిన వారికి ప్రస్తుతం జాతీయ పింఛన్‌ పథకం (NPS)లో ఉన్నారు. అయితే, ఎన్‌పీఎస్‌లో చాలా


తక్కువ మొత్తం పింఛన్‌ వస్తుందని, తమకు కూడా 2004కు ముందు ఉద్యోగులకు అమలవుతున్న పాత పింఛన్‌ పథకాన్నే (ఓపీఎస్‌నే) అమలుచేయాలని డిమాండ్లు వెల్లువెత్తాయి. దీంతో కేంద్రం యూపీఎస్‌ తీసుకొచ్చింది.


పదవీ విరమణకు ముందు 12 నెలల్లో సగటు మూలవేతనం ఎంత ఉందో దానిలో 50 శాతాన్ని ఈ పథకం కింద పింఛనుగా అందిస్తారు. ప్రస్తుతం నేషనల్‌ పెన్షన్‌ సిస్టమ్‌లో ఉన్న వారికి యూపీఎస్‌లోకి మారేందుకు వెసులుబాటు


కల్పించింది. ఇందుకు మూడు నెలల గడువు ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఏది ఎంచుకోవాలనే దానిపై స్పష్టత తెచ్చుకునేందుకు ఉద్యోగులకు కాలిక్యులేటర్‌ను అందుబాటులోకి తెచ్చింది.