
మే 11న తెలంగాణ ఎప్సెట్ ఫలితాలు
Play all audios:

2025 Results | తెలంగాణ ఎప్సెట్ ఫలితాల విడుదలకు ముహూర్తం ఖరారైంది. By Features Desk Updated : 09 May 2025 17:22 IST Ee Font size * ABC MEDIUM * ABC LARGE * ABC EXTRA LARGE 1 min read TG
EAPCET-2025 Results | హైదరాబాద్: తెలంగాణ ఎప్సెట్ ఫలితాల విడుదలకు ముహూర్తం ఖరారైంది. ఆదివారం ఉదయం 11 గంటలకు TG EAPCET ఫలితాలను సీఎం రేవంత్ రెడ్డి విడుదల చేయనున్నారు. మే 11వ తేదీ ఉదయం 11
గంటలకు విద్యార్థులు సాధించిన ర్యాంకులు, మార్కుల జాబితాను విడుదల చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఇటీవల తెలంగాణ ఎప్సెట్ ఇంజినీరింగ్, అగ్రికల్చర్- ఫార్మసీ విభాగాల ప్రిలిమినరీ కీ విడుదల
చేసిన అధికారులు.. తాజాగా ఫలితాల విడుదలకు రంగం సిద్ధం చేశారు. తెలంగాణలో ఏప్రిల్ 29 నుంచి మే 4 వరకు ఈఏపీ సెట్ (TG EAPCET) పరీక్షలు జరిగిన విషయం తెలిసిందే. ఏప్రిల్ 29, 30 తేదీల్లో
అగ్రికల్చర్, ఫార్మా ప్రవేశ పరీక్ష, మే 2 నుంచి 4 వరకు ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్ష పరీక్షలు నిర్వహించారు. దాదాపు 3లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరయ్యారు. Published : 09 May 2025 17:21
IST గమనిక: _ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన
జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి
తావు లేదు._