Swiggy q4 results: క్విక్‌ కామర్స్‌పై ఫోకస్‌.. స్విగ్గీ నష్టం డబుల్‌

Swiggy q4 results: క్విక్‌ కామర్స్‌పై ఫోకస్‌.. స్విగ్గీ నష్టం డబుల్‌

Play all audios:


Swiggy Q4 results | దిల్లీ: ఫుడ్‌ డెలివరీ ప్లాట్‌ఫామ్‌ స్విగ్గీ త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. మార్చితో ముగిసిన త్రైమాసికంలో రూ.1,018.18 కోట్ల నికర నష్టాన్ని ప్రకటించింది. క్విక్‌ కామర్స్‌


విభాగం స్విగ్గీ ఇన్‌స్టా మార్ట్‌పై పెట్టుబడులు గణనీయంగా పెరగడంతో నష్టాలు కూడా అదే స్థాయిలో పెరిగాయి. గతేడాది ఇదే త్రైమాసికంలో ఏకీకృత ప్రాతిపదికన రూ.554.77 కోట్లుగా ఉన్న స్విగ్గీ నికర


నష్టం.. నాలుగో త్రైమాసికంలో డబుల్‌ అయ్యింది. సమీక్షా త్రైమాసికంలో కార్యకలాపాల ద్వారా వచ్చే ఆదాయం 3,045.5 కోట్ల నుంచి రూ.4,410 కోట్లకు పెరిగినట్లు స్విగ్గీ తన రెగ్యులేటరీ ఫైలింగ్‌లో శుక్రవారం


పేర్కొంది. అదే సమయంలో మొత్తం ఖర్చులు గతేడాదితో పోలిస్తే రూ.3,668 కోట్ల నుంచి రూ.5,609.6 కోట్లకు చేరాయి. ఫుడ్‌ డెలివరీ విభాగంలో గ్రాస్‌ ఆర్డర్‌ వాల్యూలో 17.6 శాతం వృద్ధి నమోదైనట్లు కంపెనీ


తెలిపింది. ఈ మొత్తం రూ.7,347 కోట్లకు చేరినట్లు పేర్కొంది. స్విగ్గీ ఇన్‌స్టామార్ట్‌ సగటు ఆర్డరు విలువ 13.3 శాతం మేర పెరిగి రూ.526కు చేరినట్లు స్విగ్గీ పేర్కొంది. సమీక్షా త్రైమాసికంలో


దేశవ్యాప్తంగా 316 కొత్త డార్క్‌ స్టోర్లను తెరిచినట్లు కంపెనీ తెలిపింది. క్విక్‌ కామర్స్‌ విభాగం వేగంగా విస్తరిస్తోందని, పోటీ కూడా పెరిగిందని స్విగ్గీ ఎండీ, గ్రూప్‌ సీఈఓ శ్రీహర్ష మజేటి


పేర్కొన్నారు. మార్కెట్‌ విస్తరణలో భాగంగా పెట్టుబడులు పెంచినట్లు తెలిపారు.