
Us- china trade deal: టారిఫ్ వార్‌కు బ్రేక్.. 90 రోజుల వాయిదాకు అమెరికా, చైనా ఓకే
Play all audios:

US- china trade deal: అమెరికా- చైనా మధ్య వాణిజ్య ఒప్పందం దిశగా కీలక ముందడుగు పడింది. ఇరు దేశాలు తమ టారిఫ్‌లను వాయిదా వేయాలని నిర్ణయించాయి. US- china trade deal | ఇంటర్నెట్ డెస్క్: పరస్పర
ప్రతీకార సుంకాల ప్రకటనలతో ప్రపంచ దేశాలకు, స్టాక్ మార్కెట్లకు కంటిమీద కునుకులేకుండా చేసిన అమెరికా, చైనా ఓ అవగాహనకు వచ్చాయి. పోటాపోటీగా విధించుకున్న టారిఫ్‌లను తాత్కాలికంగా తగ్గించేందుకు
నిర్ణయించాయి. ఇరుదేశాలు 90 రోజుల పాటు తమ టారిఫ్‌లను 115 శాతం మేర తగ్గించుకుంటాయని అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెసెంట్ ప్రకటించారు. ఇరుదేశాల మధ్య స్విట్జర్లాండ్ వేదికగా జరిగిన వాణిజ్య
చర్చల్లో భాగంగా ఈ నిర్ణయం వెలువడింది. వివిధ భాగస్వామ్య దేశాలపై ప్రతీకార సుంకాల్లో భాగంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనాపై భారీగా టారిఫ్‌లు విధించారు. ప్రతిగా ఆ దేశం కూడా టారిఫ్
వార్‌కు దిగింది. దీంతో ట్రంప్ చైనా ఉత్పత్తులపై అమెరికా తన టారిఫ్‌లను 145 శాతానికి పెంచగా.. చైనా కూడా అమెరికా దిగుమతులపై 125 శాతం సుంకాలు విధించింది. దీంతో ప్రపంచ దేశాల స్టాక్ మార్కెట్లు
కుదేలయ్యాయి. ఆర్థిక మాంద్యం భయాలు తలెత్తాయి. * చల్లారిన ఉద్రిక్తతలు..32 విమానాశ్రయాలు రీఓపెన్ ఈ క్రమంలో అమెరికా, చైనా ప్రతినిధులు స్విట్జర్లాండ్ వేదికగా జరిపిన వాణిజ్య చర్చల్లో టారిఫ్‌లను
తాత్కాలికంగా వాయిదా వేసేందుకు నిర్ణయించారు. ఇందులోభాగంగా అమెరికా దిగుమతులపై చైనా తన సుంకాలను 115 శాతం అంటే 125 శాతం నుంచి 10 శాతానికి తగ్గించనుంది. మరోవైపు చైనా దిగుమతులపై అమెరికా తన
సుంకాలను 145 శాతం నుంచి 30 శాతానికి తగ్గిస్తుంది. 90 రోజుల పాటు ఈ టారిఫ్‌లు అమల్లో ఉండేలా ఇరుదేశాలు ఒప్పందం కుదుర్చుకున్నాయి.