Sophia qureshi row: కర్నల్‌ సోఫియాపై వ్యాఖ్యల ఎఫెక్ట్‌..? భాజపా నేతలకు ‘స్కిల్స్‌’ ట్రైనింగ్‌

Sophia qureshi row: కర్నల్‌ సోఫియాపై వ్యాఖ్యల ఎఫెక్ట్‌..? భాజపా నేతలకు ‘స్కిల్స్‌’ ట్రైనింగ్‌

Play all audios:


ఇంటర్నెట్‌ డెస్క్‌: ఆపరేషన్‌ సిందూర్‌ (Operation Sindoor) వివరాలను మీడియాకు తెలియజేసిన కర్నల్‌ సోఫియా ఖురేషీతోపాటు భారత సైన్యంపై మధ్యప్రదేశ్‌ మంత్రులు ఇటీవల చేసిన అనుచిత వ్యాఖ్యలు తీవ్ర


దుమారం రేపిన సంగతి తెలిసిందే. దీనిపై భాజపా అగ్రనాయకత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది. తమ నేతలకు కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ను మెరుగు పరచుకోవడంతోపాటు బహిరంగంగా మాట్లాడేటప్పుడు


బాధ్యతగా మెలగడంపై శిక్షణ ఇచ్చేందుకు సిద్ధమైంది. అయితే, ఈ కార్యక్రమం ముందస్తుగానే రూపొందించిందని, పార్టీ అంతర్గత వ్యవహారమని రాష్ట్ర భాజపా (Madhya Pradesh BJP) పేర్కొనడం గమనార్హం. ‘‘ఇటీవల


భాజపా నాయకులు చేసిన వ్యాఖ్యలతో దీనికి సంబంధం లేదు. ఇటువంటి కార్యక్రమాలు తరచుగా నిర్వహిస్తుంటాం. దీన్ని మరోలా అర్థం చేసుకోనవసరం లేదు’’ అని మధ్యప్రదేశ్‌ భాజపా అధికార ప్రతినిధి పంకజ్‌ చతుర్వేదీ


పేర్కొన్నారు. జూన్‌లో నిర్వహించనున్న ఈ కార్యక్రమానికి సంబంధించిన షెడ్యూల్‌ను త్వరలో విడుదల చేస్తామన్నారు. * పదవిలో ఉంటూ అవేం మాటలు.. మధ్యప్రదేశ్‌ మంత్రిపై సుప్రీం ఆగ్రహం మరో భాజపా సీనియర్‌


నేత మాట్లాడుతూ.. 2023లో రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ముందు కూడా ఈ తరహా శిక్షణా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామన్నారు. రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, భాజపా


ఆఫీస్‌-బేరర్లు, పార్టీ జిల్లా అధ్యక్షులు ఇందులో పాల్గొన్నారని చెప్పారు. పార్టీ విధానాలు, సిద్ధాంతాలపై కొత్త నేతలు, ఎమ్మెల్యేలకు అవగాహన కల్పించడమే దీని ప్రధాని ఉద్దేశమని, దీంతోపాటు బహిరంగ


సమావేశాల్లో మాట్లాడటంపైనా శిక్షణ ఇస్తామన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర నేతలకు పార్టీ సీనియర్లు దిశానిర్దేశం చేస్తారని చెప్పారు. కర్నల్‌ సోఫియా ఖురేషీని (Col Sophia Qureshi) ఉద్దేశిస్తూ


మధ్యప్రదేశ్‌ గిరిజన వ్యవహారాలశాఖ మంత్రి విజయ్‌ షా చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి. విపక్షాలు సహా వివిధ వర్గాల నుంచి వ్యతిరేకత వ్యక్తమైంది. ఈ క్రమంలో హైకోర్టు ఆదేశాల మేరకు మంత్రిపై


కేసు నమోదైంది. ఆయన వ్యాఖ్యలను సుప్రీం కోర్టు కూడా తీవ్రంగా పరిగణించింది. ఈ వ్యవహారం చల్లారకముందే మధ్యప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి జగ్‌దీశ్‌ దేవ్‌దా ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. భారత సైనికులపై


అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఇలా వరుస వివాదాల నేపథ్యంలో అప్రమత్తమైన కాషాయ పార్టీ.. తమ నేతలకు శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తోంది.