
Cannes 2025: కేన్స్‌లో అడుగుపెట్టిన అలియా.. ఫొటోలు షేర్ చేసిన నటి
Play all audios:

ఇంటర్నెట్ డెస్క్: బాలీవుడ్ నటి అలియా భట్ (Alia Bhatt) కేన్స్ వేదికపై హొయలొలికించారు. తొలిసారి ఈ వేడుకలకు హాజరైన అలియా.. తన లుక్‌తో అభిమానులను ఆశ్చర్యపరిచారు. సింపుల్ ఎంబ్రాయిడరీ వర్క్
చేసిన ఫ్లోరల్ గౌన్‌తో నాజూగ్గా కనిపించారు. కేన్స్ (Cannes 2025) రెడ్ కార్పెట్‌పై అరంగేట్రం చేయడానికి ముందు తన లుక్ ఫొటోలను ఇన్‌స్టాలో షేర్ చేశారు. ‘హలో కేన్స్’ అంటూ క్యాప్షన్ పెట్టారు.
ప్రస్తుతం ఆ పిక్స్ వైరల్ అవుతున్నాయి. ఈ అంతర్జాతీయ వేదికపై మెరిసిన తారల జాబితాలో అలియా చేరడం ఆనందంగా ఉందంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. * కేన్స్‌లో ఐశ్వర్య గీతా సందేశం మే 13 నుంచి 24
వరకూ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ జరగనుంది. తొలిరోజు అలియా వెళ్తారని అందరూ భావించారు. అయితే భారత్ - పాక్ ఉద్రిక్తతల నేపథ్యంలో ఆమె తన ప్రయాణాన్ని వాయిదా వేసుకున్నారు. దీంతో అసలు ఆమె
హాజరవుతారా, లేదా అని అనుకున్నారు. ఫ్యాన్స్‌కు సర్ప్రైజ్ ఇస్తూ వేడుక ముగిసే సమయానికి వేదికపై మెరిశారు అలియా.