
Anushka shetty: అనుష్క ‘ఘాటి’ వచ్చేది ఎప్పుడంటే..?
Play all audios:

నటి అనుష్క శెట్టి (Anushka Shetty) ప్రధాన పాత్రలో నటిస్తోన్న చిత్రం ‘ఘాటి’ (Ghaati). ఈ సినిమా రిలీజ్ డేట్‌ను టీమ్ తాజాగా ప్రకటించింది. హైదరాబాద్: అనుష్క శెట్టి (Anushka Shetty) ప్రధాన
పాత్రలో నటిస్తోన్న తాజా చిత్రం ‘ఘాటి’ (Ghaati). క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో ఈసినిమా సిద్ధమవుతోంది. కథానాయికా ప్రాధాన్యం ఉన్న చిత్రంగా దీనిని రూపొందిస్తున్నారు. తాజాగా ఈ సినిమా రిలీజ్
డేట్‌ను చిత్రబృందం ప్రకటించింది. వచ్చే నెల 11న దీనిని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు చెప్పింది. ఈ సందర్భంగా కొత్త పోస్టర్‌ను షేర్ చేసింది. ఇందులో నటీనటులు తమ సామాగ్రితో ఒక చోటు నుంచి
మరో చోటుకు వెళ్తూ కనిపించారు. కొవిడ్ తర్వాత సినిమాల విషయంలో అనుష్క నెమ్మదించారు. 2023లో విడుదలైన ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ తర్వాత ఆమె నటిస్తోన్న చిత్రమిది. నేరస్థురాలిగా మారిన ఓ
బాధితురాలి కథతో ఈ చిత్రం రూపొందుతోంది. ప్రతీకారం ప్రధానంగా సాగుతుంది. యు.వి.క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థలు సంయుక్తంగా రూపొందిస్తున్నాయి. వంశీకృష్ణా రెడ్డి, రాజీవ్
రెడ్డి నిర్మాతలు. విక్రమ్ ప్రభు కీలక పాత్ర పోషిస్తున్నారు. వేసవి కానుకగా ఏప్రిల్‌లోనే ఈ చిత్రాన్ని విడుదల చేయాలని టీమ్ భావించినప్పటికీ అనివార్య కారణాల వల్ల అది కుదరలేదు. ఈ నేపథ్యంలోనే
తాజాగా కొత్త రిలీజ్ డేట్‌ను టీమ్ ప్రకటించింది.