Glenn maxwell: వన్డేలకు రిటైర్మెంట్‌ ప్రకటించిన మ్యాక్స్‌వెల్‌

Glenn maxwell: వన్డేలకు రిటైర్మెంట్‌ ప్రకటించిన మ్యాక్స్‌వెల్‌

Play all audios:


ఇంటర్నెట్‌ డెస్క్‌: ఆస్ట్రేలియన్‌ స్టార్ ఆల్‌రౌండర్‌ గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌ (glenn maxwell) అంతర్జాతీయ వన్డే క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. గత కొన్నేళ్లుగా మ్యాక్స్‌వెల్‌ తరచూ


గాయాలపాలవుతున్నాడు. 2027లో వన్డే వరల్డ్‌కప్‌ నేపథ్యంలో యువకులకు అవకాశం ఇవ్వడం కోసం తాను తప్పుకుంటున్నట్లు మ్యాక్స్‌వెల్‌ తెలిపాడు. ఇక తన దృష్టి టీ20 ఫార్మాట్‌ మీద నిలపనున్నట్లు వెల్లడించాడు.


2026లో జరగనున్న టీ20 వరల్డ్‌కప్‌లో (ICC Men's T20 World Cup) ఆడాలనుకుంటున్నట్లు వివరించాడు. ‘నేను సెలక్టర్లతో మాట్లాడాను. 2027 వన్డే వరల్డ్‌ కప్‌ ఆడతాననుకోవట్లేదని వారికి వివరించా. నా


స్థానంలో వేరొకరికి అవకాశం ఇవ్వడానికి ఇదే సరైన సందర్భం అని చెప్పా. అప్పుడే వారికి నిలదొక్కుకోవడానికి సమయం దొరుకుతుంది. నాలో ఆట మిగిలి ఉన్నంతవరకు నేను తప్పుకోబోనని గతంలో చెప్పాను. కానీ నా


స్వార్థం కోసం కేవలం ఒకటి, రెండు సిరీస్‌లు మాత్రమే ఆడలేను. రానున్న వన్డే వరల్డ్ కప్‌ కోసం జట్టు కూర్పు ఎంత ముఖ్యమో నాకు తెలుసు. అందుకే ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకుంటున్నా’ అని మ్యాక్స్‌వెల్‌


వివరించాడు. 36 ఏళ్ల ఈ ఆసీస్‌ ఆటగాడు ఇప్పటివరకు 149 వన్డే మ్యాచ్‌లు ఆడాడు. 33.81 యావరేజ్‌, 126.70 స్ట్రైక్‌రేట్‌తో 3,990 పరుగులు చేశాడు. ఇందులో నాలుగు సెంచరీలున్నాయి. మ్యాక్స్‌వెల్‌కు


వన్డేల్లో అత్యధిక స్కోరు 201 నాటౌట్‌. 2023లో అఫ్గనిస్థాన్‌ మీద ఈ ఘనత సాధించాడు. అలాగే అతడు బౌలింగ్‌లోనూ ఆఫ్‌స్పిన్‌తో 77 వికెట్లు తీసుకున్నాడు. మొత్తంగా 91 క్యాచ్‌లు ఒడిసిపట్టాడు.