Krishna vamsi: ఎన్టీఆర్‌ ‘రైతు’ సినిమా.. కృష్ణవంశీ ఏమన్నారంటే

Krishna vamsi: ఎన్టీఆర్‌ ‘రైతు’ సినిమా.. కృష్ణవంశీ ఏమన్నారంటే

Play all audios:


ఇంటర్నెట్‌ డెస్క్‌: ఎవర్‌గ్రీన్‌ సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంటారు దర్శకుడు కృష్ణవంశీ. సోషల్‌ మీడియా ఎక్స్‌లో తన ఖాతాను ట్యాగ్‌ చేస్తూ ఎవరెప్పుడు పోస్ట్‌ పెట్టినా వెంటనే


స్పందిస్తుంటారు. తాజాగా ఆయన తన ఫాలోవర్స్‌తో చిట్‌చాట్‌ నిర్వహించారు. వారు అడిగిన ప్రశ్నలకు ఆసక్తికర సమాధానాలిచ్చారు. అవేంటో మీరూ చూసేయండి. నాగచైతన్యతో ‘నిన్నే పెళ్లాడుతా’ రీమేక్‌ లేదంటే..


నాగచైతన్య (NAGA CHAITANYA), ఎన్టీఆర్‌లతో ‘గుండమ్మ కథ’.. ఈ రెండిటిలో ఏం తీస్తారు? కృష్ణవంశీ: మంచి ఆలోచన. రూ.150 కోట్లు తీసుకొని వచ్చేయండి దుల్లకొట్టేదాం. చిరంజీవితో (CHIRANJEEVI) ఒక సినిమా


తీయండి? కృష్ణవంశీ: నాకు ఆ కోరిక ఉంది. ఎప్పటినుంచో ఆయన్ని అడుగుతున్నాను కూడా. కానీ.. ఎందుకో కుదరడం లేదు. నా బ్యాడ్‌లక్‌. చిరంజీవితో ‘రుద్రవీణ’ లాంటి సినిమా తీసే సీన్‌ నాకు లేదు.  జూనియర్‌


ఎన్టీఆర్‌తో (NTR) అప్పట్లో ‘రైతు’ సినిమా ప్లాన్ చేశారు. ఆ ప్రాజెక్ట్‌ ఏమైంది? కృష్ణవంశీ: ఇప్పుడు ఆయన జూనియర్‌ కాదండీ. అంతర్జాతీయ స్థాయి. ఆయనతో నేను సరిపోను. ‘ఖడ్గం 2’ తీసే ఆలోచనలో ఉన్నారా?


కృష్ణవంశీ: లేదండి. అది సాధ్యం కాదు. క్షమించండి.  * ఆ వార్తలో నిజం లేదు.. ఇంకెప్పుడూ దాని గురించి మాట్లాడను: సమంత ఒక మంచి లవ్‌స్టోరీ తీస్తారా? కృష్ణవంశీ: అసలు ఇప్పుడు లవ్ ఉందా..! మురారి లాంటి


సినిమా మరొకటి తీయండి? కృష్ణవంశీ: నాకు కాపీ చేయడం రాదండి. ఇప్పుడు అలాంటి సినిమా కష్టం. చిరంజీవితో ‘ఆపద్బాంధవుడు’ లాంటి సినిమా చేయాలని చాలామంది కోరుకుంటున్నారు? కృష్ణవంశీ: మంచి ఆలోచన..


అన్నయ్య(చిరంజీవి)తో మీరే చెప్తే బాగుంటుంది. ఓటీటీ కంటెంట్‌ చేయాలని మీకు ఆసక్తి ఉందా? కృష్ణవంశీ: ఉంది రాస్తున్నాను. కాజల్‌ అగర్వాల్‌తో ఒక మంచి సినిమా తీయండి? కృష్ణవంశీ: కాజల్ ఇప్పుడు


నటిస్తుందంటారా..!. మీరు (ఫ్యాన్స్‌) మాట్లాడితే ఓకే అవుతుందేమో. అఖిల్‌, నాగచైతన్యలతో ఓ సినిమా తెరకెక్కించండి? కృష్ణవంశీ: అలాగే.