
Preity zinta: యువ క్రికెటర్‌కి హగ్? : స్పందించిన ప్రీతి జింటా
Play all audios:

యువ క్రికెటర్‌కు తాను హగ్ ఇచ్చినట్టు కనిపించే ఫొటోపై నటి ప్రీతి జింటా రియాక్ట్ అయ్యారు. సోషల్ మీడియా వేదికగా క్లారిటీ ఇచ్చారు. ఇంటర్నెట్ డెస్క్: తాను యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ
(Vaibhav Suryavanshi)ని హగ్ చేసుకున్నట్టుగా కనిపించే ఫొటోపై నటి ప్రీతి జింటా (Preity Zinta) స్పందించారు. అది మార్ఫింగ్ చేసిన ఫొటో అని క్లారిటీ ఇచ్చారు. వాస్తవం తెలుసుకోకుండా.. అదే
మార్ఫింగ్ ఫొటోని ఉపయోగిస్తూ ఓ వెబ్‌సైట్ దానిపై వార్త రాయడంపై షాక్ అయ్యానని పేర్కొన్నారు. ఈ నెల 18న రాజస్థాన్ రాయల్స్- పంజాబ్ కింగ్స్ మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. మ్యాచ్ ముగిసిన
తర్వాత ప్రీతి.. వైభవ్‌ను హగ్ చేసుకున్నారంటూ కొందరు నెట్టింట ఫొటో పోస్టు చేశారు. అదే విషయాన్ని ఓ గుజరాతీ వెబ్‌సైట్ ప్రచురించగా నటి రియాక్ట్ అయ్యారు. మరోవైపు, పంజాబ్ కింగ్స్ సహ యజమాని
అయిన ప్రీతి.. ప్రత్యర్థి జట్టు సభ్యుడు వైభవ్‌తో అలా ఎందుకు ప్రవర్తిస్తారనే చర్చ జరిగినా.. టెక్నాలజీ ‘మాయ’ అని తేలిపోయింది. అదే మ్యాచ్‌తో.. పంజాబ్ కింగ్స్ టీమ్ 11 ఏళ్ల తర్వాత
ప్లేఆఫ్స్‌లోకి అడుగుపెట్టింది.