Thug life: జోష్‌ మీదున్న ‘థగ్‌ లైఫ్‌’ టీమ్‌.. వివరాలు వెల్లడి

Thug life: జోష్‌ మీదున్న ‘థగ్‌ లైఫ్‌’ టీమ్‌.. వివరాలు వెల్లడి

Play all audios:


దేశ సరిహద్దుల్లో ఏర్పడిన పరిస్థితుల దృష్ట్యా ఇటీవల ‘థగ్‌ లైఫ్‌’ ఆడియో లాంచ్‌ను వాయిదా వేసిన విషయం తెలిసిందే. తాజాగా దాని వివరాలను ప్రకటించింది. ఇంటర్నెట్‌ డెస్క్‌: కమల్‌హాసన్‌ (Kamal Haasan)


హీరోగా మణిరత్నం (Mani Ratnam) దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘థగ్‌ లైఫ్‌’ (Thug Life). భారీ తారాగణంతో పాన్‌ ఇండియా స్థాయిలో ఈ సినిమా సిద్ధమవుతోంది. దేశ సరిహద్దుల్లో ఏర్పడిన పరిస్థితుల


దృష్ట్యా ఇటీవల జరగాల్సిన దీని ఆడియో విడుదల కార్యక్రమాన్ని వాయిదా వేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ ఆడియో లాంచ్‌ వివరాలను టీమ్ వెల్లడించింది. మే 17న దీని ట్రైలర్‌ రానున్నట్లు చిత్రబృందం


తెలిపింది. మే 24న ఆడియో విడుదల కార్యక్రమం భారీ స్థాయిలో జరగనున్నట్లు వెల్లడించింది. ఆ ఈవెంట్‌లో ఏఆర్‌ రెహమాన్‌ ప్రత్యేక ప్రదర్శన ఇవ్వనున్నట్లు తెలిపింది. ‘‘ఇటీవల దేశం కోసం మేం మా వేడుకలను


నిలిపివేశాం. ఈ విషయంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులు ఎంతో మద్దతు ఇచ్చినందుకు కృతజ్ఞతలు. ఇప్పుడు థగ్‌ లైఫ్ ప్రయాణాన్ని తిరిగి ప్రారంభిస్తున్నాం’’ అని నోట్‌ విడుదల చేసింది.  * పవర్‌ఫుల్‌


పాత్రలో ఎన్టీఆర్‌.. ఆ బయోపిక్‌లో నటించనున్న హీరో! ‘నాయకన్‌’ (1987) లాంటి హిట్‌ తర్వాత కమల్‌ - మణిరత్నం కాంబినేషన్‌లో వస్తోన్న చిత్రమిది. గ్యాంగ్‌స్టర్‌, యాక్షన్‌ డ్రామా ఫిల్మ్‌గా ఇది


సిద్ధమవుతోంది. త్రిష, శింబు కీలకపాత్రల్లో కనిపించనున్నారు. కమల్‌ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. జూన్‌ 5న ఈ సినిమా విడుదల


కానుంది.