
Ukraine: అది అద్భుతమైన డ్రోన్ దాడి: జెలెన్‌స్కీ
Play all audios:

Ukraine | ఇంటర్నెట్‌డెస్క్: రష్యా భూభాగంలోకి చొచ్చుకెళ్లి నిర్వహించిన డ్రోన్ దాడిని ఉక్రెయిన్ అధ్యక్షుడు కొనియాడారు. ఆయన సామాజిక మాధ్యమం ఎక్స్‌లో స్పందిస్తూ.. తమ సాయుధ దళాలు అద్భుతమైన
ఆపరేషన్ నిర్వహించాయన్నారు. రష్యాకు చెందిన 40 విమానాలను ధ్వంసం చేసిన ఈ దాడికి స్పైడర్ వెబ్‌గా పేరు పెట్టినట్లు వెల్లడించారు. ఈమేరకు ఎక్స్‌లో ఆయన వరుసగా పోస్టులు చేశారు. * భీకర దాడి..
రష్యాపై విరుచుకుపడిన ఉక్రెయిన్ ‘‘ఇప్పుడే మా స్పెషల్ ఫోర్స్ అధిపతి వాసిల్ మలియుక్ అద్భుతమైన ఆపరేషన్ గురించి వెల్లడించారు. ఇది పూర్తిగా శత్రు భూభాగంలో లక్ష్యాలపై జరిగింది. ఉక్రెయిన్‌పై
దాడులకు వాడుతున్న ఆయుధాలను ఎంపిక చేసి మరీ ధ్వంసం చేశాం. రష్యాకు ఇది చాలా తీవ్రమైన నష్టం. ఆ దేశానికి ఇలా జరగాల్సిందే’’ అని పేర్కొన్నారు. ఈసందర్భంగా ఉక్రెయిన్‌కు చెందిన సెక్యూరిటీ సర్వీసెస్
సిబ్బందికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. రష్యా, ఉక్రెయిన్‌ల మధ్య సోమవారం తుర్కియేలోని ఇస్తాంబుల్‌లో శాంతిచర్చలు జరగనున్న వేళ ఈ దాడులు చోటుచేసుకోవడం గమనార్హం. దాడుల కోసం ఉక్రెయిన్ డ్రోన్లను
కంటెయినర్లలో రష్యాలోకి తరలించింది. అందుకే రష్యా భూభాగంలో 4,000 కిలోమీటర్ల లోపలికి చొచ్చుకొని వెళ్లి మరీ దాడులు చేయగలిగింది. మధ్యాహ్న సమయంలో ఇర్కుట్స్క్ ప్రాంతంలోని పలు వైమానిక స్థావరాలపై
దాడులు చేయడంతో 41 యుద్ధ విమానాలు ధ్వంసమయ్యాయి. దీంతోపాటు ర్యాజన్, ముర్మన్స్క్ ప్రాంతాల్లోనూ ఉక్రెయిన్ డ్రోన్లతో దాడులు చేసిందని రష్యన్ అధికారులు తెలిపారు.