
Suzuki avenis: సుజుకీ నుంచి 2025 అవెనిస్.. ధర, అప్‌డేట్స్ ఇవే..
Play all audios:

Suzuki Avenis | ఇంటర్నెట్ డెస్క్: ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ సుజుకీ 2025 అవెనిస్ (Suzuki Avenis) మోడల్‌ను మార్కెట్‌లో లాంచ్ చేసింది. కేంద్రం మార్గదర్శకాలకు అనుగుణంగా ఓబీడీ-2బి
ఉద్గార ప్రమాణాలతో ఈ స్కూటర్‌ను తీసుకొచ్చింది. అంతేకాదు కొత్త కలర్ ఆప్షన్లను కూడా కంపెనీ జోడించింది. ఈ స్కూటర్ ఎక్స్‌షోరూమ్ ధరను రూ.91,400గా నిర్ణయించింది. అవెనిస్‌లో 124.3 సీసీ సింగిల్
సిలిండర్ ఇంజిన్ ఉంది. ఇది 8.5 హెచ్‌పీ పవర్‌ను, 10 ఎన్‌ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. డిజైన్ పరంగా పెద్దగా మార్పులు చేయనప్పటికీ.. కొత్త రంగులను పరిచయం చేసింది. గ్లోసీ స్పార్కిల్ బ్లాక్/
పెర్ల్ గ్లేసియర్ వైట్, గ్లోసీ స్పార్కిల్ బ్లాక్/ పెర్ల్ మీరా రెడ్, ఛాంపియన్ ఎల్లో నం.2 / గ్లోసీ స్పార్కిల్ బ్లాక్, గ్లోసీ స్పార్కిల్ బ్లాక్ పెయింట్ స్కీమ్‌లతో లభిస్తుంది. డిజిటల్
ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌తో ఈ స్కూటర్ వస్తోంది. బ్యాటరీ ఓల్టేజ్, ఆయిల్ చేంజ్ ఇండికేటర్, డిజిటల్ క్లాక్, డ్యూయల్ ట్రిప్ మీటర్, ఇంజిన్ టెంపరేచర్ ఇండికేటర్, ఫ్యూయల్ గేజ్, ఎకో
మోడ్ ఇండికేటర్, ఫ్యూయల్ మీటర్ వంటివి ఇందులో కనిపిస్తాయి. ఎల్‌ఈడీ లైటింగ్, ఇంజిన్ స్టార్ట్/స్టాప్ స్విచ్, సైడ్‌స్టాండ్ ఇంటర్‌లాక్, స్టెప్ సీట్, యూఎస్‌బీతో కూడిన ఫ్రంట్
బబాక్స్, వన్‌పుష్ సెంట్రల్ లాకింగ్ సిస్టమ్ వంటివి ఇందులో ఉన్నాయి. 21.8 లీటర్ అండర్ సీట్ స్టోరేజీ స్పేస్‌తో వస్తోంది.