
Samantha: ‘శుభం’పై తల్లి స్పందన.. ఆ దర్శకుడితో దిగిన ఫొటో: సమంత పోస్టు
Play all audios:

ఇంటర్నెట్ డెస్క్: తన నిర్మాణ సంస్థ ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్‌లో ప్రముఖ నటి సమంత (Samantha) నిర్మించిన తొలి సినిమా ‘శుభం’ (Subham). వర్ధమాన నటీనటులు ప్రధాన పాత్రలు పోషించగా సమంత అతిథి
పాత్రలో నటించారు. ఇటీవల విడుదలైన ఈ మూవీని చూసిన ఆమె తల్లి నినెట్ రూత్ ప్రభు స్పందించారు. సంబంధిత వీడియోను సమంత సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ‘‘నీ యాక్టింగ్ బాగుంది. అలా
హావభావాలు పలికించడం కష్టం. సినిమా చూస్తున్నంత సేపూ కడుపుబ్బా నవ్వుకున్నా’’ అని నినెట్ పేర్కొన్నారు. * వరుస సినిమాలు.. అరుదైన రికార్డులు: దటీజ్ మోహన్‌లాల్ ఆ చిత్ర బృందం, దర్శకుడు రాజ్
నిడిమోరుతో కలిసి దిగిన ఫొటోలు, థియేటర్లలో ప్రేక్షకుల స్పందనకు సంబంధించిన విజువల్స్‌నూ సమంత షేర్ చేశారు. ‘శుభం’తో అద్భుతమైన ప్రయాణం మొదలైందని పేర్కొన్నారు. రాజ్- సమంత ఇటీవల తరచూ ఒకే చోట
కనిపించడంతో ఇటీవల పలు రూమర్స్ వచ్చాయి. తాజా ఫొటోతో నెట్టింట మళ్లీ చర్చ మొదలైంది. ‘ది ఫ్యామిలీమ్యాన్’ వంటి సూపర్‌హిట్ వెబ్‌సిరీస్‌లను తెరకెక్కించిన దర్శకద్వయంలో రాజ్ ఒకరు. రాజ్- డీకే
సంయుక్తంగా తెరకెక్కించిన ‘ది ఫ్యామిలీమ్యాన్ సీజన్ 2’, ‘సిటడెల్: హనీ బన్నీ’లో సమంత నటించిన సంగతి తెలిసిందే.