
Heinrich klaasen: 33 ఏళ్లకే అంతర్జాతీయ క్రికెట్కు హెన్రిచ్ క్లాసెన్ రిటైర్మెంట్
Play all audios:

సౌతాఫ్రికా స్టార్ బ్యాటర్ హెన్రిచ్ క్లాసెన్ (Heinrich Klaasen) అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలుకుతున్నట్లు ప్రకటించాడు. ఇంటర్నెట్ డెస్క్: సౌతాఫ్రికా స్టార్ బ్యాటర్ హెన్రిచ్ క్లాసెన్
(Heinrich Klaasen) షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలుకుతున్నట్లు ఇన్స్టాగ్రామ్ వేదికగా ప్రకటించాడు. క్లాసెన్ వయసు ప్రస్తుతం 33 ఏళ్ల 307 రోజులు మాత్రమే.
సౌతాఫ్రికాకు ఆడటం తనకు దక్కిన గొప్ప గౌరవమని పేర్కొన్నాడు. ఇన్నాళ్లు తనకు మద్దతుగా నిలిచిన సహచరులతోపాటు ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపాడు. అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు చెప్పడంతో ఇకపై
కుటుంబంతో మరింత ఎక్కువ సమయం గడుపుతానని పేర్కొన్నాడు. క్లాసెన్ సౌతాఫ్రికా తరఫున నాలుగు టెస్టులు ఆడి 104 పరుగులు, 60 వన్డేల్లో 2141 రన్స్, 58 టీ20లు ఆడి 1000 పరుగులు చేశాడు. క్లాసెన్ ఇటీవల
ఐపీఎల్ 2025లో సన్రైజర్స్ తరఫున ఆడాడు. ఇవాళే ఆస్ట్రేలియా ఆల్రౌండర్ మ్యాక్స్వెల్ కూడా వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే.