Telangana formation day: తెలంగాణ ఆర్థికంగా, సాంకేతికంగా అభివృద్ధి సాధిస్తోంది: రాష్ట్రపతి శుభాకాంక్షలు

Telangana formation day: తెలంగాణ ఆర్థికంగా, సాంకేతికంగా అభివృద్ధి సాధిస్తోంది: రాష్ట్రపతి శుభాకాంక్షలు

Play all audios:


దిల్లీ: రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రజలకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము (Droupadi Murmu) శుభాకాంక్షలు తెలిపారు. ‘‘తెలంగాణ ఆర్థికంగా, సాంకేతికంగా అభివృద్ధి సాధిస్తోంది. ఈ రాష్ట్రం


శక్తిమంతమైన పర్యావరణ వ్యవస్థ కలిగి ఉంది. తెలంగాణ ప్రజలు పురోగతిలో మరింత ముందుకు సాగాలని కోరుకుంటున్నా’’ అని రాష్ట్రపతి తన సందేశంలో పేర్కొన్నారు. తెలంగాణ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ..


రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ‘‘దేశ పురోగతికి లెక్కలేనంత కృషి చేసేలా తెలంగాణ ప్రసిద్ధి చెందింది. గత దశాబ్ద కాలంలో రాష్ట్ర అభివృద్ధికి ఏన్డీయే ప్రభుత్వం ఎన్నో చర్యలు


చేపట్టింది. తెలంగాణ ప్రజల మెరుగైన జీవన సౌలభ్యానికి కేంద్రం కృషి చేస్తోంది’’ అని ప్రధాని పేర్కొన్నారు. ‘‘తెలంగాణ ప్రజలకు రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు. రాష్ట్ర అభివృద్ధిలో కొత్త


శిఖరాలను చేరుకోవాలని కోరుకుంటున్నా. గొప్ప సంస్కృతి, కష్టపడి పనిచేసే ప్రజలతో తెలంగాణ ప్రకాశిస్తోంది’’- కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ‘‘తెలుగు రాష్ట్రాలు వేరైనా.. తెలుగు ప్రజలు, తెలుగు జాతి


ఒక్కటే. తెలుగువారు ఎక్కడున్నా సమున్నతంగా ఎదగాలన్నదే నా ఆలోచన, ఆకాంక్ష. రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్న తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు’’-ఏపీ సీఎం చంద్రబాబు