2025 tata altroz: న్యూ లుక్‌తో టాటా ఆల్ట్రోజ్‌ ఫేస్‌లిఫ్ట్‌.. ధర ₹6. 89 లక్షల నుంచి ప్రారంభం

2025 tata altroz: న్యూ లుక్‌తో టాటా ఆల్ట్రోజ్‌ ఫేస్‌లిఫ్ట్‌.. ధర ₹6. 89 లక్షల నుంచి ప్రారంభం

Play all audios:


2025 Tata Altroz | ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ ఆటోమొబైల్‌ కంపెనీ టాటా మోటార్స్‌ (Tata motors) తన ప్రీమియం హ్యాచ్‌బ్యాక్‌లో ఆల్ట్రోజ్‌ ఫేస్‌లిఫ్ట్‌ను లాంచ్‌ చేసింది. అత్యాధునిక ఫీచర్లు,


సరికొత్త డిజైన్‌తో 2025 టాటా ఆల్ట్రోజ్‌ (2025 Tata Altroz)ను భారత మార్కెట్లోకి తీసుకొచ్చింది. దీని ధర రూ.6.89 లక్షల (ఎక్స్‌ షోరూమ్‌) నుంచి ప్రారంభమవుతుంది. మారుతీ సుజుకీ బాలెనో, హ్యుందాయ్‌


ఐ20, టయోటా గ్లాంజా వంటి కార్లకు ఇది గట్టి పోటీ ఇవ్వనుంది. స్మార్ట్‌, ప్యూర్‌, క్రియేటివ్‌, అకాంప్లిష్డ్‌ ఎస్‌, అకాంప్లిష్డ్‌ +ఎస్‌ వేరియంట్లలో కొత్త ఆల్ట్రోజ్‌ను తీసుకొచ్చారు. ప్రిస్టైన్‌


వైట్‌, ప్యూర్‌ గ్రే, రాయల్‌ బ్లూ, ఎంబర్‌ గ్లో, డ్యూన్‌ గ్లో రంగుల్లో లభిస్తుంది. జూన్‌ 2 నుంచి బుకింగ్‌లు ప్రారంభం కానున్నాయి. డిజైన్‌పరంగా 2025 టాటా ఆల్ట్రోజ్‌లో కొన్ని మార్పులు చేశారు.


ఎల్‌ఈడీ హెడ్‌లైట్లు, ఐ- బ్రో స్టైల్‌ ఎల్‌ఈడీ డీఆర్‌ఎల్స్‌ ఇచ్చారు. సరికొత్త లుక్‌తో ఆకర్షించేందుకు బంపర్‌ను  నూతనంగా తీర్చిదిద్దారు. అల్లాయ్‌ వీల్స్‌కు కొత్త డిజైన్‌ అందించారు. * టిప్‌


ఇస్తేనే క్యాబ్‌ వేగంగా వస్తుందా? యాంబియంట్‌ లైటింగ్‌, వాయిస్‌- ఎనేబల్‌ సన్‌రూఫ్‌, వైర్‌లెస్‌ ఛార్జర్‌, ఎయిర్‌ ప్యూరిఫైయర్‌ వంటి ఫీచర్లు ఉన్నాయి. 5- స్టార్‌ GNCAP సేఫ్టీ రేటింగ్‌తో వస్తోంది.


సిక్స్‌ ఎయిర్‌బ్యాగులు, ఈఎస్‌పీ, హిల్‌ హోల్డ్‌ అసిస్టెంట్‌, ఫాగ్‌ ల్యాంప్స్‌, 360 డిగ్రీల కెమెరా, ఎస్‌ఓఎస్‌ కాల్‌ ఫంక్షన్‌ వంటి సేఫ్టీ ఫీచర్లతో తీసుకొచ్చింది. 1.2 లీటర్ల పెట్రోల్‌ ఇంజిన్‌,


1.5 లీటర్ల డీజిల్‌ ఇంజిన్‌, 1.2 లీటర్ల సీఎన్‌జీ ట్విన్‌ సిలిండర్ ఆప్షన్లు ఉన్నాయి. 5- స్పీడ్‌ ఎంటీ, 6- స్పీడ్‌ డీసీఏ, న్యూ 5- స్పీడ్‌ ఏఎంటీ వంటి ట్రాన్స్‌మిషన్‌ ఆప్షన్లతో వస్తోంది.