Simbu: బీప్‌ సాంగ్‌.. రెడ్‌కార్డ్‌.. : కాంట్రవర్సీపై శింబు కన్నీళ్లు

Simbu: బీప్‌ సాంగ్‌.. రెడ్‌కార్డ్‌.. : కాంట్రవర్సీపై శింబు కన్నీళ్లు

Play all audios:


తన తదుపరి చిత్రం ‘థగ్‌ లైఫ్‌’ (Thug Life) ఈవెంట్‌లో నటుడు శింబు (Simbu) కన్నీటి పర్యంతమయ్యారు. తన సినీ కెరీర్‌, తగిలిన ఎదురుదెబ్బలను ఆయన గుర్తు చేసుకున్నారు. ఇంటర్నెట్‌డెస్క్‌: కోలీవుడ్‌


నటుడు శింబు (Simbu) కీలక పాత్రలో పోషించిన చిత్రం ‘థగ్‌ లైఫ్‌’ (Thug Life). మణిరత్నం దర్శకత్వంలో ఇది రూపుదిద్దుకుంది. చెన్నై వేదికగా శనివారం రాత్రి ‘థగ్‌ లైఫ్‌’ గ్రాండ్‌ ఆడియో రిలీజ్‌ ఈవెంట్‌


జరిగింది. ఇందులో పాల్గొన్న శింబు తన సినీ కెరీర్‌, తగిలిన ఎదురుదెబ్బలు గుర్తు చేసుకున్నారు. ‘బీప్‌ సాంగ్‌’, రెడ్‌ కార్డ్‌ వివాదాలపై ఆయన మాట్లాడారు. క్లిష్ట సమయంలో తన తల్లిదండ్రులు, సంగీత


దర్శకుడు ఏఆర్‌ రెహమాన్‌, దర్శకుడు మణిరత్నం అండగా నిలిచారంటూ భావోద్వేగానికి గురయ్యారు.  ‘‘ఇన్నేళ్ల నా సినీ ప్రయాణంలో ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నా. కష్టకాలంలో నా తల్లిదండ్రులు అండగా నిలిచారు.


నాలో ధైర్యం నింపారు. నటుడిగా స్ఫూర్తి నింపిన వ్యక్తి మాత్రం కమల్‌ హాసన్‌ (Kamal Haasan). చిన్నతనం నుంచి ఆయన సినిమాలు చూసి పెరిగాను. నటుడిగా నన్ను నేను మలచుకున్నాను. నాకే కాదు నాలాంటి


ఎంతోమందికి ఆయనే స్ఫూర్తి. ఒకానొక సమయంలో నేను వరుస సినిమాలు చేస్తున్నప్పుడు.. కమల్‌హాసన్‌ని రీప్లేస్‌ చేసే నటుడు వచ్చాడంటూ చాలామంది కామెంట్స్‌ చేశారు. నిజం చెప్పాలంటే, ఆయన్ని ఎవరూ రీప్లేస్‌


చేయలేరు. నా దృష్టిలో ఆయనొక గొప్ప నాయకుడు’’ అంటూ శింబు కన్నీళ్లు పెట్టుకున్నారు. * పవన్‌ కల్యాణ్‌ ప్రకటనపై స్పందించిన సినీ నిర్మాత బన్నీ వాసు ‘బీప్‌సాంగ్‌’, రెడ్‌ కార్డ్‌ కాంట్రవర్సీల గురించి


మాట్లాడుతూ.. ‘‘ఏఆర్‌ రెహమాన్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాలి. చిన్నతనం నుంచి ఆయన్ని నేను ఎంతగానో ఇబ్బందిపెట్టా. ఇప్పటికీ పెడుతూనే ఉన్నా. నా బీప్‌ సాంగ్‌ విడుదలైనప్పుడు.. అది వివాదాస్పదమైంది.


నా జీవితంలో అదొక క్లిష్ట పరిస్థితి. ఆ సమయంలో ఆయన తన ప్రయాణాలన్నీ రద్దు చేసుకుని నా సినిమా కోసం వర్క్‌ చేయడానికి నిలబడ్డారు. ఆయన నాకెంతో సాయం చేశారు. గాయకుడిగా నాకు తొలి అవకాశం ఇచ్చిన వ్యక్తి


కూడా ఆయనే. ఇప్పటి వరకూ నేను వివిధ భాషల్లో 150 పాటలు పాడా. ఇక, ఇటీవల నాకు రెడ్‌కార్డ్‌ జారీ చేశారంటూ వార్తలు వచ్చాయి. ఆయా కథనాలు ప్రచురితమైనప్పుడు నిర్మాతలెవరూ నాతో వర్క్‌ చేయడానికి ముందుకు


రాలేదు. సినిమాల్లేక కష్టంగా అనిపించింది. అలాంటి సమయంలో నన్ను నమ్మి నాతో సినిమా చేసేందుకు ముందుకు వచ్చిన వ్యక్తి దర్శకుడు మణిరత్నం. ‘థగ్‌ లైఫ్‌’ కోసం ఆయన నిర్మాణ సంస్థ (మద్రాస్‌ టాకీస్‌)


నుంచి ఫోన్‌ వచ్చినప్పుడు తొలుత నమ్మలేదు. తర్వాత ఆయన్ని కలిసినప్పుడు ‘నిజంగానే మీరు నాకు ఫోన్‌ చేశారా?’ అని అడిగా. ఆయన తెరకెక్కించిన ‘పొన్నియిన్‌ సెల్వన్‌’లో నటించలేకపోయా. అయినప్పటికీ ఆయన


నాకు ‘థగ్‌ లైఫ్‌’లో అవకాశం ఇచ్చారు. ఆయన ఎప్పటికీ నా గురువు, గాడ్‌ ఫాదర్‌’’ అని శింబు వివరించారు. కమల్‌హాసన్‌ హీరోగా నటించిన ‘థగ్‌ లైఫ్‌’ జూన్‌ 5న విడుదల కానుంది.