Janhvi kapoor: కేన్స్‌.. ఆ విషయంలో నేనెంతో బాధపడుతున్నా: జాన్వీకపూర్‌

Janhvi kapoor: కేన్స్‌.. ఆ విషయంలో నేనెంతో బాధపడుతున్నా: జాన్వీకపూర్‌

Play all audios:


బాలీవుడ్‌ నటి జాన్వీకపూర్‌ (Janhvi Kapoor) తొలిసారి కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో సందడి చేసిన విషయం తెలిసిందే. లేత గులాబీ వర్ణం దుస్తుల్లో ఆమె ఎర్ర తివాచీపై హొయలొలికించారు. కేన్స్‌లోకి


అడుగుపెట్టడం గురించి తాజాగా ఆమె మాట్లాడారు. ఇంటర్నెట్‌డెస్క్‌: బాలీవుడ్‌ నటి జాన్వీకపూర్‌ (Janhvi Kapoor) తొలిసారి కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో సందడి చేసిన విషయం తెలిసిందే. లేత గులాబీ వర్ణం


దుస్తుల్లో ఆమె ఎర్ర తివాచీపై హొయలొలికించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ, ఫ్యాషన్‌ ప్రియులు ప్రతిష్టాత్మకంగా భావించే కేన్స్‌ (Cannes Film Festival)లోకి అడుగుపెట్టడం గురించి తాజాగా ఆమె ఓ


ఇంటర్వ్యూలో మాట్లాడారు. తన తండ్రి బోనీకపూర్‌, సోదరి ఖుషీకపూర్‌తో కలిసి తాను ఈ వేడుకలకు హాజరయ్యారన్నారు. ఈ ఈవెంట్‌ తనకెంతో ప్రత్యేకమన్న ఆమె.. ఓ విషయంలో మాత్రం బాధపడుతున్నట్లు వెల్లడించారు. తన


తల్లి, దివంగత నటి శ్రీదేవికి ఈ ప్రాంతమంటే ఎంతో ఇష్టమని గుర్తు చేసుకున్నారు. ‘‘హాలీడే ఎంజాయ్‌ చేయడానికి అమ్మ తరచూ మమ్మల్ని ఇక్కడికి తీసుకువస్తుండేవారు. అమ్మకు కేన్స్‌ అంటే ఎంతో ఇష్టమైన


ప్రాంతం. నాకు గుర్తున్నంతవరకూ వరుసగా నాలుగు సంవత్సరాలపాటు వేసవి సెలవులకు ఇక్కడికే వచ్చాం. ఈరోజు నేను కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో తొలిసారి పాల్గొనడం నా కుటుంబానికి ఎంతో ప్రత్యేకమైన విషయం.


నటిగా అమ్మ ఎన్నో అవార్డులు, రివార్డులు సొంతం చేసుకుంది. ఆమెకు సంబంధించిన ప్రతి కార్యక్రమానికి నన్ను తీసుకువెళ్లేది. ఆమె విజయాలను కుటుంబమంతా కలిసి సెలబ్రేట్‌ చేసుకునేవాళ్లం. ఆ రోజులు


మాకెప్పటికీ గుర్తుంటాయి. ఈరోజు మేమంతా మళ్లీ కేన్స్‌లోకి అడుగుపెట్టాం. నాతోపాటు నాన్న, చెల్లి కూడా వచ్చారు. అమ్మ లేకుండా ఇక్కడికి రావడం నాకెంతో బాధగా ఉంది. ఆమెను నేనెంతో మిస్‌ అవుతున్నా’’ అని


జాన్వీకపూర్‌ చెప్పారు. * జాన్వీని విపరీతంగా ట్రోల్‌ చేశారు కానీ..: దర్శకుడు వ్యాఖ్యలు కేన్స్‌లో తన లుక్‌ని ఉద్దేశించి మాట్లాడుతూ.. ‘‘నా సోదరి రియా కపూర్‌ ఈ డ్రెస్‌ డిజైన్‌ చేసింది. లుక్‌


విషయంలో ఆమె చాలా క్లియర్‌గా ఉంది. తను అనుకున్నది సాధించడంలో ఎక్కడా రాజీ పడలేదు. లేత గులాబీ వర్ణం గౌనులో ఎర్ర తివాచీ పైకి అడుగుపెట్టడం మాకెంతో సంతోషాన్ని ఇచ్చింది’’ అని అన్నారు. రియాకపూర్‌


బాలీవుడ్‌లో పేరుపొందిన డిజైనర్‌. బీటౌన్‌లో అగ్ర తారలకు ఆమె స్టైలిష్ట్‌గా వ్యవహరిస్తుంటారు. వివాహ సమయంలో రాధిక మర్చంట్‌కు ఆమె స్టైలిష్ట్‌గా చేశారు.