
Ipl 2025: మే 17 నుంచి ఐపీఎల్ పునః ప్రారంభం.. జూన్ 3న ఫైనల్
Play all audios:

ఇంటర్నెట్ డెస్క్: భారత్ - పాకిస్థాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఐపీఎల్ 2025 సీజన్‌ను బీసీసీఐ వాయిదా వేసిన సంగతి తెలిసిందే. పరిస్థితులు కాస్త చక్కబడటంతో ఐపీఎల్ (IPL) 2025లో మిగిలిన
17 మ్యాచ్‌లకు సంబంధించిన షెడ్యూల్‌ను బోర్డు విడుదల అయింది. మే 17 నుంచి మ్యాచ్‌లు తిరిగి ప్రారంభంకానున్నాయి. ఫైనల్‌తో సహా లీగ్ స్టేజ్‌లో 13, ప్లేఆఫ్స్ 3 మ్యాచులు జరగనున్నాయి. మొత్తం ఆరు
వేదికల్లో (బెంగళూరు, జైపుర్, దిల్లీ, ముంబయి, లఖ్‌నవూ, అహ్మదాబాద్) మ్యాచ్‌లు జరుగుతాయి. భారత ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపిన అనంతరం బీసీసీఐ షెడ్యూల్‌ను ఖరారు చేసింది. మే 29 క్వాలిఫయర్ - 1,
30న ఎలిమినేటర్, జూన్ 1న క్వాలిఫయర్ - 2, జూన్ 3న ఫైనల్ నిర్వహించనున్నారు. అయితే, ప్లే ఆఫ్స్ మ్యాచ్‌ల వేదికలు ఇంకా ఖరారు చేయలేదు. రెండు ఆదివారాలు డబుల్ హెడ్డర్లు మ్యాచ్‌లు ఉంటాయి. పంజాబ్ -
దిల్లీ మ్యాచ్ మధ్యలోనే ఆగిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌ను కూడా నిర్వహించనుంది. అయితే, మళ్లీ మొదటి నుంచి నిర్వహిస్తారా? లేకపోతే అప్పటికే ఒక ఇన్నింగ్స్ కొనసాగుతోంది. దానిని అలాగే
కొనసాగిస్తారా? అనేది స్పష్టం చేయలేదు. షెడ్యూల్ ఇదే * బెంగళూరు VS కోల్‌కతా : మే 17, శనివారం (బెంగళూరు వేదికగా రాత్రి 7.30గంటలకు) * రాజస్థాన్ VS పంజాబ్: మే 18, ఆదివారం (జైపుర్ వేదికగా
మధ్యాహ్నం 3.30గంటలకు) * దిల్లీ VS గుజరాత్: మే 18, ఆదివారం (దిల్లీ వేదికగా రాత్రి 7.30 గంటలకు) * లఖ్‌నవూ VS హైదరాబాద్: మే 19, సోమవారం (లఖ్‌నవూ వేదికగా రాత్రి 7.30 గంటలకు) * చెన్నై VS
రాజస్థాన్: మే 20, మంగళవారం (దిల్లీ వేదికగా రాత్రి 7.30 గంటలకు) * ముంబయి VS దిల్లీ: మే 21, బుధవారం (ముంబయి వేదికగా రాత్రి 7.30 గంటలకు) * గుజరాత్ VS లఖ్‌నవూ: మే 22, గురువారం (అహ్మదాబాద్
వేదికగా రాత్రి 7.30 గంటలకు) * బెంగళూరు VS హైదరాబాద్: మే 23, శుక్రవారం (బెంగళూరు వేదికగా రాత్రి 7.30 గంటలకు) * పంజాబ్ VS దిల్లీ: మే 24, శనివారం (జైపుర్ వేదికగా రాత్రి 7.30 గంటలకు) *
గుజరాత్ VS చెన్నై: మే 25, ఆదివారం (అహ్మదాబాద్ వేదికగా మధ్యాహ్నం 3.30 గంటలకు) * హైదరాబాద్ VS కోల్‌కతా: మే 25, ఆదివారం (దిల్లీ వేదికగా రాత్రి 7.30 గంటలకు) * పంజాబ్ VS ముంబయి: మే 26, సోమవారం
(జైపుర్ వేదికగా రాత్రి 7.30 గంటలకు) * లఖ్‌నవూ VS బెంగళూరు: మే 27, మంగళవారం (లఖ్‌నవూ వేదికగా రాత్రి 7.30 గంటలకు) * తొలి క్వాలిఫయర్: మే 29, గురువారం (వేదిక ఖరారు కాలేదు, రాత్రి 7.30 గంటలకు)
* ఎలిమినేటర్: మే 30, శుక్రవారం (వేదిక ఖరారు కాలేదు, రాత్రి 7.30 గంటలకు) * రెండో క్వాలిఫయర్: జూన్ 1, ఆదివారం (వేదిక ఖరారు కాలేదు, రాత్రి 7.30 గంటలకు) * ఫైనల్ : జూన్ 3, మంగళవారం (వేదిక ఖరారు
కాలేదు, రాత్రి 7.30 గంటలకు)