
Deepika padukone: ఎప్పుడూ మనసు చెప్పేదే వింటాను: దీపికా పదుకొణె
Play all audios:

ఇంటర్నెట్ డెస్క్: ఎప్పుడూ తన మనసు చెప్పేదే వింటానన్నారు బాలీవుడ్ నటి దీపికా పదుకొణె (Deepika Padukone). ఏ కార్యక్రమంలోనైనా సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్‌గా నిలిచే ఆమె.. తాజాగా ఓ ఫ్యాషన్ షోలో
హొయలొలికించారు. అక్కడ మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘జీవితంలో బ్యాలెన్స్‌డ్‌గా ఉండాలంటే నిజాయతీ ముఖ్యం. నేను దానికే ప్రాధాన్యతనిస్తాను. క్లిష్ట పరిస్థితులు ఎదురైనప్పుడల్లా
నా మనసు చెప్పేది వింటాను. ఆ తర్వాతే నిర్ణయాలు తీసుకుంటాను. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొంటాను’’ అని దీపికా చెప్పారు. రెండు రోజులుగా దీపికా పేరు సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన విషయం
తెలిసిందే. తన సినిమాను లీక్ చేసే ప్రయత్నం చేస్తున్నారంటూ ఒక స్టార్ డైరెక్టర్ చేసిన కామెంట్స్ ఆమెను ఉద్దేశించే అంటూ నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో నిజాయతీ గురించి దీపికా చేసిన
వ్యాఖ్యలు పరోక్షంగా ఆ వివాదాన్ని ఉద్దేశించే అనుకుంటున్నారు. * కథను లీక్ చేయడమే మీ ఫెమినిజమా..?: హాట్ టాపిక్‌గా మారిన సందీప్ వంగా పోస్ట్ దీపికా చివరిసారిగా ‘సింగం అగైన్’ (Singham
Again)లో కనిపించారు. రోహిత్ శెట్టి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అజయ్ దేవ్‌గణ్, కరీనాకపూర్‌ఖాన్, రణ్‌వీర్‌సింగ్, అక్షయ్‌కుమార్‌లు కీలకపాత్రలు పోషించారు. దీనితో పాటు గతేడాది ‘కల్కి 2898
ఏడీ’లో సుమతి పాత్రలో కనిపించి సందడి చేశారు. ప్రస్తుతం దీని సీక్వెల్ పనులు జరుగుతున్నాయి.