
Kiran abbavaram: తండ్రైన కిరణ్ అబ్బవరం.. ఫొటో షేర్ చేసిన నటుడు
Play all audios:

రహస్య, కిరణ్ అబ్బవరం తల్లీదండ్రులయ్యారు. సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ఇంటర్నెట్ డెస్క్: నటుడు కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) తండ్రి అయ్యారు. గురువారం తమకు బాబు పుట్టాడని తెలిపారు.
ఈ శుభవార్తను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ఈ మేరకు ఆయన షేర్ చేసిన ఫొటోలో.. బాబు కాలిని ముద్దాడుతూ కనిపించారు. పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు శుభాకాంక్షలు
తెలియజేస్తున్నారు. నటి రహస్యను కిరణ్ ప్రేమ పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ‘రాజావారు రాణిగారు’లో కలిసి నటించిన వీరిద్దరు.. వివాహ బంధంతో గతేడాది ఒక్కటయ్యారు.‘క’ సినిమాతో కిరణ్ గతేడాది
మంచి విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ‘కె- ర్యాంప్’ సినిమాలో నటిస్తున్నారు. జైన్స్ నాని దర్శకత్వం వహిస్తున్నారు.