Tourist family: రాజమౌళి మెచ్చిన మూవీ: ‘టూరిస్ట్‌ ఫ్యామిలీ’ ఓటీటీ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌

Tourist family: రాజమౌళి మెచ్చిన మూవీ: ‘టూరిస్ట్‌ ఫ్యామిలీ’ ఓటీటీ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌

Play all audios:


శశికుమార్‌, సిమ్రన్‌ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘టూరిస్ట్‌ ఫ్యామిలీ’. ఓటీటీ విడుదల తేదీ తాజాగా ఖరారైంది. ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ దర్శకుడు రాజమౌళి (Rajamouli) మెచ్చిన కామెడీ డ్రామా


మూవీ ‘టూరిస్ట్‌ ఫ్యామిలీ’ (Tourist Family) ఓటీటీ విడుదల తేదీ ఖరారైంది. ‘జియో హాట్‌స్టార్‌’ (Jio Hotstar)లో జూన్‌ 2 నుంచి స్ట్రీమింగ్‌ కానుంది. శశికుమార్‌, సిమ్రన్‌ ప్రధాన పాత్రల్లో దర్శకుడు


అభిషాన్‌ జీవింత్‌ తెరకెక్కించిన ఈ సినిమా మే 1న థియేటర్లలో విడుదలైంది. ‘‘అద్భుతమైన సినిమా చూశా. హృదయాన్ని కదిలించింది. కడుపుబ్బా నవ్వించింది. అభిషాన్‌ గొప్పగా రచించి, డైరెక్షన్‌ చేశారు. ఇటీవల


కాలంలో చూసి బెస్ట్‌ సినిమా ఇది. మీరూ తప్పకుండా చూడండి’’ అని ఈ సినిమాని ఉద్దేశించి కొన్ని రోజుల క్రితం పోస్టు పెట్టిన సంగతి తెలిసిందే. కోలీవుడ్‌ హీరోలు రజనీకాంత్‌, సూర్య, శివకార్తికేయన్‌


టాలీవుడ్‌ హీరో నాని తదితరులు ఈ సినిమాపై ప్రశంసలు కురిపించారు. రూ.10 కోట్ల లోపు బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా దాదాపు రూ.75 కోట్లు వసూలు చేయడం విశేషం.  ఇదీ కథ: ధర్మదాస్‌ అలియాస్‌ దాస్‌


(శశికుమార్‌).. భార్య వాసంతి (సిమ్రన్‌), కుమారులతో కలిసి శ్రీలంక నుంచి భారత్‌కు అక్రమంగా వస్తాడు. వీళ్ల వివరాలు ఎవరికీ తెలియకుండా ఉండేలా దాస్‌ బావమరిది తగిన జాగ్రత్తలు తీసుకుంటాడు. ఎవరితోనూ


మాట్లాడొద్దని, ఏ విషయాలు చెప్పొద్దని దాస్‌ ఫ్యామిలీకి చెప్పినా.. వారు దానికి భిన్నంగా ప్రవర్తిస్తారు. అదే వారిని సమస్యల్లో చిక్కుకునేలా చేస్తుంది. ఓ బాంబు బ్లాస్ట్‌కు దాస్‌ కుటుంబం కారణమని


పోలీసులు గుర్తిస్తారు. మరి, నిజంగా ఆ ఘటనకు దాస్‌ కుటుంబమే కారణమా? అన్నది ఆసక్తికరం.