
Anaganaga: ఊహకు మించిన ఆదరణ.. ‘అనగనగా’ ఓటీటీ నుంచి థియేటర్లలోకి: సుమంత్
Play all audios:

ఇంటర్నెట్ డెస్క్: థియేటర్లలో విడుదలైన తర్వాత సినిమాలు ఓటీటీలోకి రావడం, మరోవైపు నేరుగా ఓటీటీలోనే రిలీజ్ కావడం సాధారణం. కానీ, ముందుగా ఓటీటీలో రిలీజై, ఆ తర్వాత థియేటర్లలో విడుదల కావడం అరుదు.
ఈ రెండో జాబితాలోదే ‘అనగనగా’ (Anaganaga). సుమంత్ (Sumanth), కాజల్ చౌదరి, మాస్టర్ విహర్ష్ ప్రధాన పాత్రల్లో సన్నీ సంజయ్ తెరకెక్కించిన ఈ సినిమా ఇది. ప్రముఖ ఓటీటీ ‘ఈటీవీ విన్’ (ETV Win)లో
కొన్ని రోజుల క్రితం విడుదలైన ఈ సినిమాకి మంచి స్పందన దక్కింది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ చిత్రం థియేటర్లలోకి రానుందని సుమంత్ తెలిపారు. నటుడు అడివి శేష్ ముఖ్య
అతిథిగా హాజరై సందడి చేశారు. * ఈ వారం ఓటీటీ వినోదాలివే.. ఏయే సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ఉన్నాయంటే? ‘ఈటీవీ విన్’తో నా జర్నీ కొనసాగుతూనే ఉంటుంది: సుమంత్ ‘‘ఇలాంటి సినిమాలకు రచన చాలా ముఖ్యం.
‘అనగనగా’ కథను సన్నీ, దీప్తి అద్భుతంగా రాశారు. నేను గతంలో నటించిన ‘మళ్లీరావా’ తర్వాత నన్ను అంతగా ఆకట్టుకున్న కథ ఇదే. ‘ఈటీవీ విన్’తో నా ప్రయాణం కొనసాగుతూనే ఉంటుంది. ఈ స్క్రిప్టుపై మాకు ముందు
నుంచీ నమ్మకం ఉంది. సినిమా చూసిన అడివి శేష్ భావోద్వేగానికి గురయ్యాడు. ‘ఈ చిత్రంలో విషయం ఉంది’ అని అప్పుడు అనుకున్నా. మేం ఊహించిన దాని కంటే ఎక్కువగా ప్రేక్షక ఆదరణ దక్కడం ఆనందంగా ఉంది. నేరుగా
ఓటీటీ ‘ఈటీవీ విన్’లో విడుదలైన ఈ సినిమాని ఆడియన్స్ డిమాండ్ మేరకు పలు థియేటర్లలో రిలీజ్ చేయనున్నాం. ముందుగా విజయవాడ(ఈ నెల 24న), విశాఖపట్నం (ఈ నెల 25న)లో ప్రదర్శించనున్నాం. త్వరలో మరిన్ని
స్క్రీన్స్‌లో ప్రదర్శిస్తాం’’ అని సుమంత్ తెలిపారు. ఇది ఏడిపించే సినిమా కాదు: అడివి శేష్ ‘‘నా తొలి సినిమా ఈవెంట్‌కు సుమంత్ ముఖ్య అతిథిగా వచ్చారు. అప్పటి నుంచే ఆయన కుటుంబ సభ్యుడిలాంటి వారు.
‘అనగనగా’లో సుమంత్ పోషించిన వ్యాస్ పాత్రకు, ఆయన జీవితానికి కొన్ని పోలికలున్నాయి. నా అసలు పేరు సన్నీ. ఈ సినిమా డైరెక్టర్ ఏమైనా ఛాన్స్ ఇస్తారేమో చూడాలి (నవ్వుతూ). నాతో సినిమా చేయాలంటే చాలా
సమయం పడుతుంది. ప్రమోషన్స్ ప్రారంభించక ముందే ఈ చిత్రాన్ని నేను చూశా. ఎమోషనల్ అయ్యా. అయితే ఇది ఏడిపించే సినిమా కాదు.. ఫీల్ అయ్యేలా చేస్తుంది’’ అని శేష్ పేర్కొన్నారు.